Advertisement
Google Ads BL

పిల్లల పెళ్లిళ్లపై తేజ కామెంట్స్ వైరల్


దర్శకుడు తేజ గెలుపోటములతో సంబంధం లేకుండా సినిమాలు తీసే వ్యక్తి. రామ్ గోపాల్ వర్మ బడి నుండి వచ్చిన తేజకి కొంచెం తిక్క అంటారు ఆయనతో పని చేసిన చాలామంది హీరోలు. ప్రస్తుతం దగ్గుబాటి అభిరామ్ ని అహింసా మూవీతో తెరకి పరిచయం చేస్తున్నారు. ఆ సినిమా అనేక రిలీజ్ డేట్స్ మార్చుకుంటూ ఎట్టకేలకి రేపు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Advertisement
CJ Advs

ఈ సందర్భంలోనే తేజ అనేక యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వూస్ ఇస్తూ సినిమా కెరీర్ తో పాటుగా పర్సనల్ విషయాలని పంచుకుంటున్నారు. ఆయన తన కొడుకుని హీరోగా ఇంట్రడ్యూస్ చేద్దామనుకుంటున్నాడట. అందుకే అమెరికా వెళ్లి డైరెక్టర్ అయ్యేందుకు కావాల్సిన శిక్షణ కూడా తీసుకున్నాడట అతను.. కానీ తన కొడుకుని తేజ హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తా అన్నారు. తన డైరెక్షన్ లోనా.. వేరేవారి దర్శకత్వంలోనా అనేది క్లారిటీ ఇవ్వలేదు. తన కూతురు రీసెంట్ గానే చదువు పూర్తి చేసుకుని అమెరికా నుండి వచ్చింది అని చెప్పారు.

సదరు యాంకర్ మీ పిల్లల పెళ్లిళ్ల విషయంలో ఏమనుకుంటున్నారు అని అడగ్గానే.. నేను ముందే చెప్పాను వాళ్ళకి. నేను పెళ్లి కొడుకుని చూసి పది మందికి కార్డులు పంచి పెళ్లి చెయ్యను.. మీరే ఎవరో ఒకరిని వెతుక్కుని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండి.. పదిమందికి మాత్రం భోజనాలు పెడతాను.. తర్వాత అన్ని బావుంటే కలిసి ఉండండి.. లేదంటే విడిపోండి.. ఫైనల్ గా సంతోషమే మెయిన్ అని చెప్పాను అంటూ తేజ తన పిల్లల పెళ్లిళ్లపై సెన్సేషనల్ కామెంట్స్ చేసారు.

Director Teja bold comments about his daughter marriage :

Director Teja bold comments about his daughter marriage goes viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs