Advertisement
Google Ads BL

నెక్స్ట్ ప్రాజెక్ట్ రీమేక్ కాదు: అల్లు శిరీష్


ఉర్వశివో రాక్షసివో లాంటి బోల్డ్ హిట్ తర్వాత అల్లు శిరీష్ ఇంతవరకు నెక్స్ట్ ప్రోజెక్ట్ ప్రకటించలేదు. తాజాగా తన నెక్స్ట్ ప్రోజెక్టు పై తానే సోషల్ మీడియా ద్వారా అప్ డేట్ ఇస్తూ ఓ ప్రీ లుక్ పోస్టర్ ని కూడా వదిలాడు. That's me & my co-star from my next film. Surprised? I'll be revealing the first look & glimpse of my next film on May 30th at 4:05pm. So stay tuned! #NotARemake .

Advertisement
CJ Advs

మే 30 సాయంత్రం 4:05 కి తన కొత్త ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ తో పాటుగా గ్లిమ్ప్స్ వస్తున్నాయని.. ఓ ప్రీ లుక్ పోస్టర్ వదిలాడు. ఆ ప్రీ లుక్ లో అల్లు శిరీష్ వెనక్కి తిరిగి నించొగా తన పక్కనే ఓ టెడ్డి ఉంది. అందుకేనేమో ప్రత్యకంగా అల్లు శిరీష్ ఇది రీమేక్ కాదు అని క్లారిటీ ఇచ్చింది. తమిళంలో ఆర్య-సయేషా జంటగా టెడ్డి మూవీ తెరకెక్కి తెలుగులోనూ దబ్ అయ్యింది. ఇక్కడ అల్లు శిరీష్ పక్కన టెడ్డి చూడగానే అదే సినిమా రీమేక్ అనుకుంటారేమో అని ముందుగానే శిరీష్ దీనిపై స్పష్టతనిచ్చాడన్నమాట.

మరి ఆర్య పక్కన ఉన్న సేమ్ టెడ్డీతో కొత్త సినిమా ఏం తీస్తున్నాడబ్బా.. ఇంత సైలెంట్ గా ఫస్ట్ లుక్ ని గ్లిమ్ప్స్ ని రెడీ చేసేసాడు అంటూ అల్లు ఫాన్స్ ఆలోచనలో పడిపోయారు. హ.. మరొక్క రోజు వెయిట్ చేస్తే దానిపై క్లారిటీ వచ్చేస్తుందిలే.

Allu Sirish Next project update:

Allu Sirish co star surprises all
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs