సహజ నటి సాయి పల్లవి అంటే ఇష్టపడని వారు ఉండరు. గ్లామర్ కోసం వెతికే కళ్ళకి సాయి పల్లవి ఆనకపోయినా.. పెరఫార్మెన్స్ కావాలంటే ఆమె సినిమాలు చూస్తారు. అనవరసంగా స్కిన్ షో చెయ్యని సాయి పల్లవి సెలక్టీవ్ గా సినిమాలు చేస్తుంది. ఆమె నటన, డాన్స్ కి ఫిదా కానీ ప్రేక్షకుడు ఉండడు. ప్రెజెంట్ కమల్ హాసన్ నిర్మాతగా శివ కార్తికేయన్ తో సాయి పల్లవి రొమాన్స్ చేస్తుంది.
అయితే ఇప్పుడో హిందీ నటుడు సాయి పల్లవి అంటే క్రష్ అంటున్నాడు. బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో మట్లాడుతూ తనకి హీరోయిన్ సాయి పల్లవి అంటే చాలా ఇష్టమని, సాయి పల్లవి అందం, డాన్స్ కి తాను పడిపోయాను, ఆమె తన క్రష్ అంటూ ఇంట్రస్టింగ్ వ్యాఖ్యలు చేసారు. సాయి పల్లవి ఫోన్ నెంబర్ తన దగ్గర ఉన్నప్పటికీ ఆమెకి ధైర్యంగా ఫోన్ చేయలేకపోతున్నాను అంటూ తన ప్రేమని బయటపెట్టాడు.
ఆమె అందం, నటన, డాన్స్ అన్నిటికి మంత్ర ముగ్దుడునవుతాను. కొన్నిసార్లు ఆమెని చూడగానే ఇన్ ఫ్యాక్సువేషన్ కి లోనవుతాను. ఆమె నటించిన సినిమాలన్నీ చూస్తాను. ఆమె అంటే ఎంత ఇష్టమో చెప్పలేను. నా జీవితంలో సాయి పల్లవి తో ఒక్కరోజు అయినా కలిసి పని చెయ్యాలని కలలు కంటున్నాను, ఆ రోజు నా సంతోషానికి అవధులుండవు అంటూ చెప్పుకొచ్చాడు.