దేవర ఎన్టీఆర్ ఇప్పుడు వెకేషన్స్ మూడ్ లో ఉన్నాడు. భార్య ప్రణతి, పిల్లలు భార్గవ్, అభయ్ లతో కలిసి చిన్నపాటి ట్రిప్ ప్లాన్ చేసుకుని విదేశాలకు వెళ్లిన ఎన్టీఆర్ అక్కడ భార్య, పిల్లలతో ఎంజాయ్ చెయ్యడం లేదు. అక్కడా జిమ్ ట్రైనర్ ఆధ్వర్యంలో ఫిట్ నెస్ కోసం చమటలు చిందిస్తున్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆర్.ఆర్.ఆర్ కోసం పెరిగిన వెయిట్ ని తగ్గించుకోవడానికి ఎన్టీఆర్ ఏడాది కాలంగా శ్రమిస్తూనే ఉన్నాడు. భీమ్ పాత్ర కోసం బరువు పెరగడంతో ఎన్టీఆర్ తర్వాత ఆ బరువు తగ్గించడానికి జిమ్ లో చాలా వర్కౌట్స్ చేసాడు.
కొద్దిరోజుల ముందు వరకు కాస్త లావుగానే కనబడిన ఎన్టీఆర్ ఈమధ్యన బాగా బరువు తగ్గి హ్యాండ్ సమ్ లుక్స్ లో కనిపిస్తున్నాడు. రెండు నెలలుగా దేవర షూటింగ్ లో తలమునకలైన కొరటాల-ఎన్టీఆర్ లు ఎన్టీఆర్ బర్త్ డే కి దేవర లుక్ తో ఇంప్రెస్స్ చేసారు. లుంగీ కట్టి జాలరిగా ఎన్టీఆర్ ఊర మాస్ అవతార్ అందరిని ఆకట్టుకుంది. అయితే దేవర షూటింగ్ నుండి షార్ట్ బ్రేక్ దొరకడంతో ఎన్టీఆర్ ఫామిలీతో సమ్మర్ వెకేషన్స్ కి వెళ్ళాడు.
ఇక వెకేషన్స్ లో భార్య, కొడుకులతో సరదాగా ఎంజాయ్ చెయ్యడం మానేసి ఫిట్ నెస్ కోసం జిమ్ లో వర్కౌట్ చేస్తూ చమటలు చిందిస్తున్నాడు. తాజాగా ఎన్టీఆర్ ఫిట్ నెస్ కోసం వర్కౌట్స్ చేస్తున్న పిక్ వైరల్ గా మారింది.