Advertisement
Google Ads BL

పవన్ వీరమల్లు సెట్స్ లో భారీ అగ్నిప్రమాదం


పవన్ కళ్యాణ్-క్రిష్ కలయికలో తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు మూవీ షూటింగ్ అప్ డేట్ ఇవ్వకపోవడంతో ఆయన ఫాన్స్ చాలా డిస్పాయింట్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు షూటింగ్ పక్కనబెట్టి దాదాపు ఆరు నెలలు అవుతుంది. ఇప్పటివరకు ఆయన వీరమల్లు సెట్స్ లోకి కాలు పెట్టిన దాఖలాలు లేవు. ఈమధ్యలో హరి హర వీరమల్లు స్క్రిప్ట్ పవన్ కి నచ్చలేదు.. అందుకే షూటింగ్ ఆగిపోయింది అనే వార్తలు కూడా వింటూనే ఉన్నాము. 

Advertisement
CJ Advs

ఇలాంటి సందర్భంలోనే హరి హర వీరమల్లు సెట్స్ లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం బయటికి వచ్చింది. దుండిగల్ బేరం పేటలోని హరి హర వీరమల్లు కోసం వేసిన ప్రత్యేక సెట్ లో అగ్నిప్రమాదం.. మంటలార్పరుతున్న అగ్నిమాపక సిబ్బంది.. అగ్ని ప్రమాద సమయంలో సెట్ కి సంబందించిన వర్కర్స్ మాత్రమే ఉన్నారని, నటులు కానీ చిత్ర బృందం కానీ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లుగా  తెలుస్తుంది. 

భారీగా ఆస్తినష్టం జరిగినట్లుగా సమాచారం.. అంటూ ఛానల్స్ లో హెడ్ లైన్స్ చూసేసరికి ప్రమాదం జరిగినందుకు బాధపడాలో.. లేదంటే హరి హర వీరమల్లు షూటింగ్ చేస్తున్నారేమో.. ఆ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది అని సంతోషపడాలో తెలియని సందిగ్ధంలో పవన్ ఫాన్స్ ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు, గాయపడలేదు, అగ్నిప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేరని తెలుస్తుంది. అసలు ప్రమాదానికి కారణాలేమిటో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రస్తుతం క్రిష్ కూడా పవన్ ఇచ్చే డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. షూటింగ్ ఓ కొలిక్కి రాకుండా హరి హర వీరమల్లు డేట్ ఇచ్చేందుకు కూడా మేకర్స్ సాహసం చెయ్యడం లేదు. ఆయన ఎప్పుడు అందుబాటులోకి వచ్చి షూటింగ్ కంప్లీట్ చేస్తారో వీరమల్లు మేకర్స్ కి కూడా ఓ క్లారిటీ లేదు.

A huge fire broke out on the sets of Hari Hara Veeramallu:

A huge fire broke out on the sets of Pawan Kalyan Hari Hara Veeramallu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs