Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ తో చేసేంత టాలెంట్ లేదు: తేజ


కొన్నేళ్లుగా సక్సెస్ కి దూరమైన దర్శకుడు తేజ రానాతో చేసిన నేనే రాజు నేనే మంత్రితో ట్రాక్ లోకి వచ్చారు. మళ్ళీ తర్వాత అదే ప్లాప్ లు ఆయన్ని వెక్కిరించాయి.. ఇప్పుడు తాజాగా ఆయన దగ్గుబాటి అభిరామ్ ని తెలుగు తెరకి పరిచయం చేస్తున్నారు. ఆయనేదో సురేష్ బాబు కొడుకు అని, ఆయనేదో పెద్ద ఫ్యామిలీ నుండి వస్తున్న అబ్బాయి అని పరిచయం చెయ్యడం లేదు.. రామానాయుడు గారు అడిగారని మాత్రమే ఆయన మనవడు అభిరామ్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన తేజ.. తాజాగా కొన్ని ఇంటర్వూస్ లో తాను చేసిన సినిమాల వలన నిర్మాతలు నష్టపోకపోయినా తాను మాత్రం భారీ లాస్ చూశానని.. అవి కట్టేందుకు డబ్బు లేకపోవడంతో ఇల్లుని బ్యాంకు జప్తు చేసింది, తర్వాత దానికి డబ్బు కట్టి విడిపించుకున్నా అంటూ సెన్సేషనల్ గా మాట్లాడారు.

Advertisement
CJ Advs

ఇక సదరు ఇంటర్వ్యూలో మీకు నచ్చే హీరో ఎవరు అంటే.. మహేశ్ బాబు, రజనీకాంత్, రామ్ చరణ్, ప్రభాస్ అంటే ఇష్టం.. ఈ మధ్య కాలంలో థియేటర్ లో సినిమా చూడాలి అంటే.. రామ్ చరణ్ సినిమా చూస్తాను. రంగస్థలంలో తన నటన చూసినప్పటి నుంచి అతనంటే ఇష్టం. ఆ సినిమాలో రామ్ చరణ్ నటన, మ్యానరిజం బాగా నచ్చాయి అన్నారు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలంటే ఎలాంటి సినిమా చేస్తారు అని అడగ్గా..

ఎన్టీఆర్ తో సినిమా చేసేంత టాలెంట్ నాకు లేదు అంటూ తేజ ఇంట్రెస్టింగ్ గా సమాధానం చెప్పారు. ప్రస్తుతం అహింసాతో రేపు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తేజ.. తదుపరి చిత్రాన్ని రానాతో చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఆ చిత్రానికి రాక్షస రాజు అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారని తెలుస్తుంది.

Teja Interesting comments on Jr NTR:

Director Teja Interesting comments on Jr NTR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs