Advertisement
Google Ads BL

కీర్తి సురేష్ పెళ్లి రూమర్స్: స్పందించిన తండ్రి


కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుంది, ఆమె ప్రేమలో ఉంది.. త్వరలోనే కీర్తి సురేష్ వివాహమంటూ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్న న్యూసులు. ప్రేమించినవాడితో కీర్తి సురేష్ ఏడడుగులు నడవబోతుంది అంటున్నారు. రీసెంట్ గా తన ఫ్రెండ్ తో క్లోజ్ గా ఉన్న పిక్ ని కీర్తి షేర్ చెయ్యగానే అదిగో అతన్నే కీర్తి వివాహం చేసుకుంటుంది అన్నారు. కానీ కీర్తి సురేష్ అతను నా క్లోజ్ ఫ్రెండ్, నా లైఫ్ లో ఉన్న మిస్టరీ మ్యాన్ గురించి సందర్భం వచ్చినప్పుడు బయటపెడతాను అని చెప్పేసింది. 

Advertisement
CJ Advs

నిజంగానే కీర్తి సురేష్ లైఫ్ లో మిస్టరీ మ్యాన్ ఉన్నాడు.. ఆమె అతన్నే పెళ్లి చేసుకుంటుంది అంటూ మరో న్యూస్ సోషల్ మీడియాకి ఎక్కింది. అయితే కీర్తి సురేష్ పెళ్లిపై స్ప్రెడ్ అవుతున్న న్యూస్ లకి ఆమె తండ్రి అడ్డుకట్ట వేశారు. మా కుమార్తె ప్రేమలో ఉంది.. అతనితోనే ఆమె వివాహం అంటూ కథనాలు రాస్తున్నారు. అందులో ఎంతమాత్రమూ నిజం లేదు. కీర్తి సురేష్ లైఫ్ లో ఎవరూ లేరు. కీర్తి సురేష్ ఫ్రెండ్ గురించి రాసారు. అతను నాకు తెలుసు. అతను మా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా..

కీర్తి సురేష్ పెళ్లి చేసుకుంటుంది. ఆమె పెళ్లి చేసుకుంటే మీడియాకి ముందే చెబుతాము. అంతేకాని ఇప్పుడే చేసుకుంటుంది అని తప్పుడు వార్తలు ప్రచారం చెయ్యకండి. ఇలాంటి రూమర్స్ వలన మా ఫ్యామిలిలో మనశ్శాంతి కరువవుతుంది.. అంటూ ఆయన ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కూతురి పెళ్లిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

Keerthy Suresh father official statement on her marriage:

Keerthy Suresh Father Reacts About Her Love And Marriage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs