అఖిల్ అక్కినేని రీసెంట్ ఫిల్మ్ ఏజెంట్ విడుదలై నెల అయ్యింది. గత నెల ఏప్రిల్ 28 న క్రేజీగా భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చి అంచనాలు అందుకోలేక డిసాస్టర్ లిస్ట్ లోకి వెళ్లిపోయిన ఏజెంట్ మూవీ ఓటిటిలోకి మూడు వారాలు తిరక్కుండానే అంటే ఏప్రిల్ 19నే వచ్చేస్తుంది అంటూ దాని ఓటిటీ పార్ట్నర్ సోని లివ్ పోస్టర్ వేసి ప్రకటించింది. తీరా చూస్తే అనుకున్న తేదికి ఏజెంట్ ఓటిటిలోకి రాలేదు.
కొన్ని కారణాల వలన ఏజెంట్ ఓటిటీ రాక ఆలస్యమైంది.. త్వరలోనే ఓటిటీ కొత్త డేట్ ఇస్తామంటూ సోని లివ్ చెప్పింది. మరి ఏజెంట్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసి సరిగ్గా ఈరోజుకి నెల అయ్యింది. కానీ సోనిలివ్ మాత్రం ఏజెంట్ ఓటిటీ రాకపై ఇంకా ప్సష్టత ఇవ్వలేదు. అటు థియేటర్స్ లో డిసాస్టర్ అయిన ఫిలిమ్స్ మూడు వారాల్లోనే ఓటీటీలలో వచ్చి దుమ్ము రేపుతుంటే.. హిట్ మూవీస్ నెలకే ఓటిటిలోకి వచ్చేస్తున్న రోజుల్లో ఏజెంట్ మాత్రం ఇలా సైలెంట్ గా ఉండడం అక్కినేని ఫాన్స్ ని డిస్పాయింట్ చేస్తుంది.
డిసాస్టర్ సినిమాకి కూడా ఓటిటీ రిలీజ్ కి మేకర్స్ ఇంతిలా ఆలోచిస్తున్నారేమిటో విచిత్రంగా అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.