హీరో శర్వానంద్ మరో ఐదు రోజుల్లో పెళ్లి కొడుకుగా పెళ్లి పీటలెక్కబోతున్నాడు. రాజస్థాన్ లోని లీలా ప్యాలెస్ లో తాను ప్రేమించిన రక్షిత రెడ్డిని డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడానికి రెడీ అయ్యాడు. ఇంతలోపులో శర్వానంద్ కి యాక్సిడెంట్ అయ్యింది అనే న్యూస్ అందరికి షాకిచ్చింది. శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు ఫిల్మ్ నగర్ జంక్షన్ దగ్గర అదుపు తప్పిన సంఘటన చోటుచేసుకుంది. ఈ యాక్సిడెంట్ లో శరానంద్ కి చిన్న చిన్న గాయాలైనట్లుగా తెలుస్తుంది.
ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదని.. శర్వా కూడా చిన్న చిన్న గాయాలతో తప్పించుకున్నాడని అంటున్నారు. శర్వానంద్ కారుకి ప్రమాదం అన్న న్యూస్ చూడగానే ఆయన అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే శరానంద్ టీమ్ మాత్రం శరానంద్ కి ఏ ప్రమాదం జరగలేదు.. ఎవరూ భయపడవద్దు అంటూ సోషల్ మీడియా ద్వారా స్పందించింది.
హీరో శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు ఫిల్మ్ నగర్ జంక్షన్ దగ్గర అదుపు తప్పిన సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అందరూ క్షేమంగా వున్నారు. కారుకి మాత్రం చిన్న గీతలు పడ్డాయి. చాలా స్వల్ప సంఘటన. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
-టీమ్ శర్వానంద్