నందమూరి తారకరరామారావు గారి శతజయంతి వేడుకలు ఈ ఏడాది పొడుగునా ఆయన ఫ్యామిలీ మెంబెర్స్, ఇంకా శతజయంతి కమిటీ మెంబెర్స్, పలువురు ప్రముఖులు నిర్వహించారు. ప్రస్తుతం టీడీపీ మహానాడులో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మే 28 ఎన్టీఆర్ 100 వ పుట్టినరోజు వేడుకలతో సినీ, రాజకీయప్రముఖులు పెద్దాయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.
అందులో ఎన్టీఆర్ తో ఎంతో అనుబంధం ఉండి ఆయనతో సినిమాల్లో పని చేసిన లేడీ సూపర్ స్టార్, పొలిటిషన్ విజయశాంతి సోషల్ మీడియా వేదికగా సీనియర్ ఎన్టీఆర్ ని తలచుకుని.. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న తారక రామారావు గారు, డాక్టర్ ఎన్టీఆర్ గారు...
నేను 14 సంవత్సరాల చిన్న పిల్లగా, నా సినిమా జీవిత ప్రయాణ ప్రారంభ సంవత్సరాలలో సత్యంశివం సినిమాలో చెల్లెలిగా ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారితో కలిసి నటించే అవకాశం కలిగింది సుమారు 1980లో... అంటూ ఎన్టీఆర్ తో విజయశాంతి స్టేజ్ ని పంచుకున్న పిక్ షేర్ చేస్తూ ఈ విధంగా ట్వీట్ చేసింది.