Advertisement
Google Ads BL

త్రివిక్రమ్ కి నిద్ర లేకుండా చేస్తున్నాడు


నిన్న శుక్రవారం సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేష్ గురూజీ కి కాస్ట్లీ గిఫ్ట్ అంటూ పేల్చిన బాంబ్ బాగా పేలింది. ప్రొడ్యూసర్ అవ్వాలని ఉంది అని అడిగిన తన అభిమానికి ప్రొడ్యూసర్ అవ్వాలంటే గురూజీకి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చుకోవాలంటూ ట్వీట్ చేసాడు. గత కొద్దిరోజులుగా గురూజీ త్రివిక్రమ్ పై బండ్ల గణేష్ కోపంగా ఉండడమే కాదు అవకాశం వచ్చినప్పుడల్లా గురూజీని సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తూ వస్తున్నాడు. 

Advertisement
CJ Advs

త్రివిక్రమ్ తనని తన దేవుడు పవన్ కళ్యాణ్ కి దూరం చేస్తున్నాడనే బాధలో బండ్ల గణేష్ త్రివిక్రమ్ ని ఈ రకంగా ఏసుకుంటున్నాడు అనేది ఇప్పుడు చాలామందిలో ఉన్న అభిప్రాయం.

ఇక ఈ రోజు త్రివిక్రమ్ పేరు ఎత్తకుండానే అతన్ని టార్గెట్ చేస్తూ మరో ట్వీట్ వేసాడు. భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. భగవంతుడికి భక్తుడిని దూరం చేసేది గురూజీ దర్బార్ సుత్తి 😂 అంటూ ట్వీట్ చేసాడు. ఈరకమైన ట్వీట్స్ తో బండ్ల గణేష్ త్రివిక్రమ్ కి నిద్ర లేకుండా చేస్తున్నాడని చాలామంది చెబుతున్న మాట. బండ్ల గణేష్ త్రివిక్రమ్ తో ఎంతగా ప్రాబ్లెమ్ ఫేస్ చేసాడో అందుకే ఇంతగా రగిలిపోతున్నాడంటున్నారు.

ఇక బండ్ల గణేష్ ఇలా ట్వీట్ చేస్తే.. ఆయన అభిమాని ఒకరు. భక్తుడిని దూరం చేసే శక్తి ఎవ్వరికీ ఉండదు. కేవలం. భక్తుడి నడవడిక మాత్రమే భగవంతుడిని దూరం చేస్తుంది.. అంటూ రిప్లై ఇచ్చాడు.

Bandla targets Guruji again and again:

Bandla Ganesh personally targets Trivikram again
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs