Advertisement
Google Ads BL

హాట్ టాపిక్: పవిత్ర లోకేష్ పారితోషకం


సీనియర్ యాక్ట్రెస్ పవిత్ర లోకేష్ కేరెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న నటి. హీరో-హీరోయిన్స్ కి తల్లిగా, రెడ్ సినిమాలో డిఫరెంట్ కేరెక్టర్ లో మెప్పించిన పవిత్ర లోకేష్ ఇప్పుడు నరేష్ తో సహజీవనం, మళ్ళీ పెళ్లి విషయంలో బాగా హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా క్రేజీ కేరెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన పవిత్ర లోకేష్ ఇప్పటివరకు రోజుకి 50 వేలు చొప్పున పారితోషకం అందుకుంటుంది. 

Advertisement
CJ Advs

కానీ మళ్ళీ పెళ్లితో ఆమెకి పెరిగిన క్రేజ్ కారణంగా ఆమె రేంజ్ కూడా పెరిగినట్లుగా తెలుస్తుంది. 50 వేలు అందుకుంటున్న పవిత్ర లోకేష్ ఇప్పుడు రోజుకి లక్ష డిమాండ్ చేస్తుంది అని తెలుస్తోంది. గతంలో నరేష్ తో పవిత్ర లోకేష్ వ్యవహారం బయటికి వచ్చాక ఆమె కి స్టార్ హీరోల అవకాశాలు చేజారాయనే టాక్ నడిచింది. అంతేకాకుండా ఈ వయసులో నరేష్ తో పవిత్ర యవ్వారంపై ట్రోల్స్ నడిచాయి. ఈ విషయంలో నరేష్-పవిత్రలు కేసులు కూడా పెట్టారు.

అంతలా మీడియాలో ఫెమస్ అయిన పవిత్ర లోకేష్ కి ఇప్పుడు అడిగిన పారితోషకం ఇచ్చేందుకు దర్శకనిర్మాతలు కూడా రెడీ అంటున్నారట. మరి ఐదు పదుల వయసులో ఈ రేంజ్ క్రేజ్ పవిత్ర లోకేష్ కి మాత్రమే సాధ్యమయ్యిందేమో కదా!

Pavitra Lokesh Hikes Remuneration?:

Is Really Pavithra Lokesh Demanding 1L Remuneration?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs