Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ కి హీరోయిన్ లేకపోవడమా ?


2019 లో వచ్చిన వార్ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ ప్రకంపనాలే సృష్టించింది. గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ పొటెన్షియాలిటీని ప్రూవ్ చేసింది. ఇప్పుడదే వార్ కి సీక్వెల్ సిద్ధమవుతోంది. అంతకుమించిన స్థాయిలో అనూహ్యమైన రేంజ్ లో.

Advertisement
CJ Advs

ఈసారి దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ కాదు. బ్రహ్మాస్త్ర తీసిన అయాన్ ముఖర్జీ దర్శకుడు. అలాగే ఈసారి హృతిక్ తో తలపడేది ఆషామాషీ బాలీవుడ్ హీరోలు కాదు.. అల్లాటప్పా క్యాస్టింగ్ కాదు. ఏకంగా ఎన్టీఆర్ ని దించారు. ఈసారి వీరి పోరు ఎంత రసవత్తరంగా ఉంటుందో.. ఎక్కడికక్కడ వెండితెరలే నిరూపిస్తాయి, వేడెక్కిస్తాయి.   

అయితే వార్ 2 విషయంలో కొత్తగా తెలుస్తోన్న అంశం.. కథ ప్రకారం ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ కనిపించనున్నారు. కానీ స్పై థ్రిల్లర్స్ లో కనిపించే గ్లామర్ డాల్స్ గా మాత్రమే. అటు హృతిక్ రోషన్ కి గాని, ఇటు ఎన్టీఆర్ కి గాని లవ్ ఇంట్రెస్ట్ ఉండదని, పర్టిక్యులర్ హీరోయిన్ ఉండరని వినికిడి. ఎన్టీఆర్ లాంటి హీరోని పెట్టుకుని హీరోయిన్ లేకుండా గ్లామర్ లేకుండా ఓన్లీ యాక్షన్ పార్ట్ తో సినిమా  ప్లాన్ చేస్తున్నారంటే సాహసమనే చెప్పాలి. చూద్దాం ఇదెంతవరకు నిజమో.

అన్నట్టు అయాన్ ముఖర్జీ అత్యద్భుతంగా ప్లాన్ చేసిన ఓ సాంగ్ ఉందట. అందులో డ్యాన్సింగ్ డెవిల్స్ హృతిక్-ఎన్టీఆర్ ఇద్దరినీ ఒకే పాటలో ఒకేసారి ఒకేరకమయిన నృత్య రీతులతో మనం చూడబోతున్నాం.

NTR does not have a heroine?:

No romance for NTR in War2 <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs