మహానటిగా జాతీయ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ అంతటి ఇమేజ్ నుంచి బయటికి రావాలని ప్రయత్నిస్తుంది. కమర్షియల్ హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఆమెకి ఆశించిన ఫలితాలు దక్కట్లేదు. గ్లామరస్ రోల్స్ లో ఆడియన్స్ ఆమెని పూర్తిగా యాక్సెప్ట్ చెయ్యట్లేదు.
అలాగని మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి ఇలాంటి సినిమాలు కూడా ప్రేక్షకులని సంతృప్తి పరచలేకపోయాయి. బట్ కీర్తి సురేష్ ప్రయత్నాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. కొత్త కొత్త కోణాల్లో సరికొత్త పాత్రలను వెతుక్కుంటూ వెళుతూనే ఉన్నాయి.
ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా నటిస్తున్న కీర్తి సురేష్ ఈ మధ్య వచ్చిన దసరా సినిమాలో వెన్నెలగా ఎన్ని వన్నెలు చూపించిందో ఎలాంటి పెరఫార్మెన్స్ చూపించిందో అందరికి తెలిసిందే. అయితే నటిగా పెరఫార్మెన్స్ చూపించడంతో పాటు యాక్ట్రెస్ గా తనలోని గ్లామర్ యాంగిల్ ని కూడా స్క్రీన్ పైకి తీసుకురావాలనుకుంటున్న కీర్తి సురేష్ సర్కారు వారి పాట లో ఆ అట్టెంప్ట్ కి తెర తీసింది. ఇప్పుడదే కీర్తికి అనూహ్యమైన ఆఫర్ తీసుకొచ్చి పెట్టింది. ఆ వివరాల్లోకి వెళితే..
భారీ అంచనాలున్న హెవీ ప్రాజెక్ట్ లో స్పెషల్ సాంగ్ కోసం కీర్తిని సంప్రదించారట. అంతటి అంచనాలున్న సినిమాలో ఆ తరహా పాట చెయ్యడానికి కీర్తి కూడా సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆమెకి ఆఫర్ చేసిన అమౌంట్ కూడా కళ్ళు చెదిరే రేంజ్ లో ఉన్నట్టు వినికిడి. మరి కళ్ళు చెదిరే రేంజ్ అమౌంట్ అందుకున్నప్పుడు అంతటి భారీ ప్రాజెక్ట్ లో ఆఫర్ పొందినప్పుడు ఇక కీర్తి అందాల ఆరబోత ఎలా ఉంటుందో ప్రేక్షకులే ఊహించుకోవచ్చు.