Advertisement
Google Ads BL

తల్లితో టైమ్ స్పెండ్ చేస్తున్న సామ్


సమంత శాకుంతలం సినిమా రిజల్ట్ తర్వాత సోషల్ మీడియాలో పెద్దగా హడావిడీ చెయ్యడం లేదు. సిటాడెల్ ప్రీమియర్స్ కోసం లండన్ వెళ్ళినప్పుడు ఆమె లుక్, ఆమె యాక్టీవ్ నెస్ చూసిన వారు ఆమెని సోషల్ మీడియాలో ట్రోల్ చేసారు. సమంత ఇండియాలో ఒకలా విదేశాలలో ఒకలా అంటూ ఆడేసుకున్నారు. అయితే ప్రస్తుతం సిటాడెల్ షూటింగ్ కోసం ఎక్కువగా సమంత ముంబై లోనే గడుపుతుంది.

Advertisement
CJ Advs

షూటింగ్స్ కోసం తరచూ ముంబై వెళ్లి అక్కడే ఎక్కువ రోజులు ఉండడంతో సమంత ముంబైలో కూడా ఓ ఖరీదైన ఇల్లు కొన్నట్టుగా అప్పుడెప్పుడో వార్తలొచ్చాయి. ఇక ఇక్కడ సౌత్ లో విజయ్ దేవరకొండతో శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి మూవీలో నటిస్తుంది. ఈ రెండు షూటింగ్స్ కోసం హైదరాబాద్-ముంబై జర్నీ చేస్తున్న సమంత నాగ చైతన్యతో విడిపోయాక ఒంటరిగా ఉండకుండా కొన్నాళ్ళు ఫ్రెండ్స్, తర్వాత తన పేరెంట్స్ కలిసి ఉంటుంది. మాయోసైటిస్ బారిన పడినప్పుడు ఫ్యామిలీతోనే కలిసి ఉన్న సమంత తాజాగా తన తల్లితో స్పెండ్ చేస్తున్న పిక్స్ వదిలింది.

తన తల్లితో కలిసి సమంత సమయం గడపడానికి డిన్నర్ డేట్ కి వచ్చినట్టుగా తెలుస్తుంది. తల్లి పక్కనే ఉండగా సామ్ ఐస్ క్రీమ్ లాగిస్తున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ పిక్ లో సమంత గ్లామర్ గా కనిపించినా కళ్ళకి మాత్రం అద్దాలతో దర్శనమిచ్చింది.

Samantha Shares Lovely Click With Her Mother:

Samantha Shares Lovely Click With Her Mother On A Dinner Date
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs