Advertisement
Google Ads BL

అందుకే రెండో పెళ్లి : ఆశిష్ విద్యార్థి


పోకిరి విలన్ ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. 60 ఏళ్ళ వయసులో అందమైన అమ్మాయితో ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి చేసుకుని ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యడం పట్ల పలు విమర్శలు, ట్రోల్స్ వచ్చాయి. ఫ్యాషన్ డిజైనర్ రూపాలిని ఆశిష్ విద్యార్థి రెండో వివాహం చేసుకున్నారు. ఈ వయసులో మొదటి భార్యకి విడాకులిచ్చి పడుచు పెళ్ళాన్ని తెచ్చుకున్నావా.. ఇదంతా నీకు ఇప్పుడు అవసరమా అంటూ నెటిజెన్స్ తిట్టిపోస్తున్నారు

Advertisement
CJ Advs

అయితే ఆశిష్ విద్యార్థి తాను రెండో పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చారు. ఓ వీడియో ద్వారా రెండో పెళ్లి, మొదటి భార్యతో విడాకుల విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. మన జీవితాలు వేరు, మన చదువులు వేరు, వేర్వేరు ఆలోచనలతో మనం ఉంటాము, వేర్వేరు వృత్తులలో ఉంటాము, వేర్వేరు నమ్మకాలతో ఉంటాము.. కానీ మనం అందరం కోరుకునేది ఆనందం. 22 ఇయర్స్ బ్యాక్ నేను పీలూని వివాహం చేసుకున్నాను.

అది అద్భుతంగా జరిగింది. మాకొ కొడుకు అర్జ్ ఉన్నాడు. అతనికి ఇప్పుడు 22 ఏళ్ళు. చాలా ఏళ్ళు కలిసి ఉన్న మాకు భవిష్యత్తు ఆలోచనలు వేర్వేరుగా ఉండడాన్ని గమనించాము. అది కూర్చుని మాట్లాడుకుంటే తీరిపోయే సమస్యలా అనిపించలేదు. అందులో ఎవరో ఒకరి సంతోషాన్ని త్యాగం చెయ్యాలి. అందుకే స్నేహపూర్వకంగా విడిపోయి ముందుకు సాగాలనుకున్నాము. అలా విడాకులు తీసుకున్నాము. తర్వాత నాకు ఓ తోడు కావాలి అనిపించింది. 55 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. ఆ క్రమంలోనే రూపాలిని కలిసాను. 

మేము చాటింగ్ లో మట్లాడుకున్నాం, ఏడాది క్రితమే కలిసాను. తనకి 50 ఏళ్ళు, నాకు ఇంకా 60 ఏళ్ళు రాలేదు. 57 మాత్రమే. అయినా పెళ్లికి ప్రేమకి వయసుతో పని లేదు. మేమిద్దరం హ్యాపీ గా కలిసి ప్రయాణిద్దామనుకున్నాము అంటూ ఆశిష్ విద్యార్థి తనపై వస్తున్న ట్రోల్స్ కి ఇలా వీడియోతో క్లారిటీ ఇచ్చారు.

Ashish Vidyarthi finally reacts to second wedding:

Ashish Vidyarthi Opens Up On His Second Marriage Rupali
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs