Advertisement
Google Ads BL

ఈ ఫ్రైడే రిలీజెస్.. రివ్యూస్.. రిజల్ట్స్


మే నెల చివరివారంలో చిన్న సినిమాలు పోటెత్తాయి. బాక్సాఫీసు వద్ద పోటీ పడ్డాయి. ఏ సినిమాకా సినిమా తమదైన ప్రమోషన్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి శతవిధాలా ప్రయత్నించాయి. అయితే మరీ గొప్పగా చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ మాత్రం ఈ వారం విడుదలైన ఏ సినిమాకీ దక్కలేదు. అన్నీ నామమాత్రం వసూళ్లే. సినిమాలపై కూడా అంతంత మాత్రం వ్యాఖ్యలే. మరి ఫైనల్ గా ఈవారం విడుదలైన సినిమాల రివ్యూ ఏమిటో, రిజల్ట్స్ ఏమిటో, రెస్పాన్స్ ఎలా ఉందో, రెవిన్యూ ఏమేరకు వస్తుందో.. ఓ మినీ సమీక్షలో తెలుసుకుందాం.

Advertisement
CJ Advs

2018: 

కన్నడ రంగం నుంచి తీసుకొచ్చిన కాంతార కాసులు కురిపించినట్టే.. నేటి మలయాళీ మెగా హిట్ 2018 కూడా మన దగ్గర మ్యాజిక్ చేస్తుందని నమ్మి బన్నీ వాస్ రిలీజ్ చేసిన సినిమా 2018. సినిమాగా లోపాలేమి లేనప్పటికీ.. మన ప్రేక్షకులని ఆకర్షించే క్యాస్టింగ్ లేని కారణంగా అంతంతమాత్రం ఆరంభ వసూళ్లు దక్కాయి ఈ చిత్రానికి. అయితే మౌత్ టాక్ బావుండడం, ప్రమోషన్స్ విషయంలో బన్నీ వాస్ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదనడం మున్ముందు ఈ సినిమా కలెక్షన్స్ ని పెంచేలా కనిపిస్తోంది. ఇప్పటివరకు వచ్చిన పాజిటివ్ రివ్యూస్, ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్న పాజిటివ్ టాక్ 2018 కి ప్లస్ అవ్వనున్నాయి.

మళ్ళీ పెళ్లి:

వ్యక్తిగత జీవితంలో తలెత్తిన తన సొంత సమస్యలకు సమాధానం ఇచ్చుకునేలా సొంత డబ్బులతో నరేష్ తీసుకున్న సినిమా మళ్ళీ పెళ్లి. ఈ సినిమాలో ప్రధానంగా మూడో భార్యతో నరేష్ కి ఎదురైన ఘర్షణ, తన భర్త వలన పవిత్ర ఎదుర్కొన్న సంఘర్షణ వంటి అంశాలతో కావలసినట్టుగా కథని మలుచుకుని సినిమాగా తీసుకొచ్చేసారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే నరేష్ పట్టుబట్టి చేయించుకుంటున్న పబ్లిసిటీ, ఓ వర్గం ప్రేక్షకుల క్యూరియాసిటీ ఈ సినిమాకి కాస్త కలెక్షన్స్ ని తెచ్చిపెడుతున్నాయి. 

మేమ్ ఫేమస్:

ఈమధ్య కాలంలో సోషల్ మీడియా అంతటా హద్దులు దాటిన హంగామా చేసేసింది మేమ్ ఫేమస్ టీమ్. ప్రమోషనల్ కంటెంట్ మొత్తం కూడా ఓ ప్రామిసింగ్ ఎంటర్టైనర్ కి భరోసా ఇవ్వడంతో ఇది మరో జాతి రత్నాలు అనేలా యువతరం ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపించారు. కానీ తెరపైకి వచ్చేసరికి మాత్రం మేమ్ ఫెమస్ జస్ట్ నామ్ కా వాస్తే ఫేమస్ లా మిగిలిపోయింది. పెరఫార్మెన్సెస్ వైజ్ అందరూ ఆకట్టుకున్నా ఇమ్మెచ్యూర్డ్ రైటింగ్ ఈ సినిమా విజయానికి అడ్డంకిగా మారింది. అంతంత మాత్రం ఫలితంతో ఆపేసింది.

మెన్ టూ:

మీ టూ అనేది ఆ మధ్య ఓ పెద్ద సంచలనం. హీరోయిన్లు, క్రీడాకారిణులు ఇంకా ఇతరత్రా సెలబ్రిటీస్ చాలామంది మూకుమ్మడిగా దండెత్తి మగాళ్ల అహంకారంపై, అకృత్యాలపై ఆరోపణలు చేసిన ఉద్యమం. దానినే సెటైరికల్ గా తీసుకుని మెన్ టూ అంటూ ఆడవాళ్ళ వల్ల ఇబ్బందులు పడ్డ మగవాళ్ల కష్టాలని కామిక్ వే లో తెరపైకి తెచ్చే ప్రయత్నమే మెన్ టూ చిత్రం. అయితే కేరెక్టరైజేషన్స్ ని ఎస్టాబ్లిష్ చెయ్యడంలో పెట్టిన శ్రద్ద కథా, కథనాలపై పెట్టకపోవడం వల్ల.. ఉండాల్సిన కామెడీ పండకపోవడం వల్ల మెన్ టూ కూడా అంతంతమాత్రం అవుట్ ఫుట్ గానే అనిపిస్తోంది ఆడియన్స్ కి.

గ్రే :

డిఫరెంట్ ఫిల్మ్ మేకర్ గా కాస్త గుర్తింపు పొందిన రాజ్ మదిరాజు దర్శకుడిగా అందించిన తాజా చిత్రం గ్రే. స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ తో చేసిన ఈ సినిమాలో స్పయింగ్ తగ్గి, థ్రిల్స్ మిస్సయ్యి అడల్ట్ కంటెంట్ ఎక్కువైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆడియన్స్ నుంచి. అసలు ఏమాత్రం పబ్లిసిటీ చెయ్యకుండా ఎలాంటి చడీ చప్పుడు లేకుండా వచ్చిన ఈ చిత్రం అంతే నిశ్శబ్దంగా తిరుగుముఖం పట్టడం ఖాయం అనేది ట్రేడ్ టాక్.!

పెద్ద సినిమాల పోటీ లేకున్నా, హిట్ సినిమాలతో పోటీ పడే పని లేకున్నా నేటికీ చిన్న సినిమా నామమాత్రపు వసూళ్ల కోసం సఫర్ అవుతోంది, థియేటర్స్ లో ఓ వారం పాటైనా నిలిచేందుకు సతమతమవుతోంది అంటే తప్పు ప్రేక్షకులది కాదు మేకర్స్ ది. చూపించాల్సింది ప్రచారంలో హంగామా కాదు కథాకథనాల విషయంలో శ్రద్ద. సినిమా మేకింగ్ విషయంలో నిబద్దత.!

This Friday Releases.. Reviews.. Results:

Today Releases.. Reviews.. Results
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs