Advertisement
Google Ads BL

రాజకీయాలపై ఫుల్ ఫోకస్ పెట్టిన పవన్


ఈమధ్యన సినిమాలపై ఎక్కువ దృష్టి సారించిన పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కొన్నాళ్లుగా సినిమా షూటింగ్స్ తోనే కనబడుతున్న ఆయన మధ్యలో ఒకటి రెండు రోజులు మాత్రం పాలిటిక్స్ కి స్పెండ్ చేస్తూ వచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్, బ్రో ద అవతార్ అలాగే మధ్యలో OG షూటింగ్స్ అంటూ క్షణం తీరిక లేకుండా కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ తాజాగా రాజకీయాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు.

Advertisement
CJ Advs

ఈరోజు మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ ను ఎలాంటి ఆర్భాటం లేకుండా ప్రారంభించారు, తర్వాత పవన్ కళ్యాణ్ పొత్తులు, అలాగే ఎలక్షన్స్ బరిలో నిలబెట్టే అభ్యర్థులపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఏపీ ఎలక్షన్స్ పై వస్తున్న సర్వేలపై దృష్టి పెట్టడమే కాకుండా సర్వేలు నిర్వహిస్తున్న సంస్థలతో పవన్ కళ్యణ్ మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఏపీ రాజకీయాల్లో పొత్తులతోనే అధికారం సాధ్యమని చెబుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పొత్తుల వ్యవహారం తేల్చేసేలా కనబడుతున్నారు. 

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ బలం.. ఓట్ల శాతం పైన ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చినట్లుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ సింగిల్ గానే ఈ వ్యవహారం చక్కబెడుతున్నారు. కేవలం కొందరు ముఖ్య నేతలకు మాత్రమే సమాచారం ఉంది అని తెలుస్తుంది.

Pawan Kalyan shifted Complete Focus on Politic:

Pawan Kalyan Inagurates his New Party Office at Mangalagiri
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs