Advertisement
Google Ads BL

శ్రీలీలపై చెయ్యి చేసుకున్న బాలయ్య


హీరోయిన్ శ్రీలీల ఇప్పుడు క్రేజీ క్రేజీగా స్టార్ హీరోలు, యంగ్ హీరోల సినిమాలతో దూసుకుపోతున్న సూపర్ ఎక్ష్ప్రెస్స్. శ్రీలీల నామ జపం చేస్తున్న టాలీవుడ్ జనాలకి కిక్ ఇచ్చేందుకు శ్రీలీల వరస ప్రాజెక్ట్స్ తో రెడీ కాబోతుంది. ఈ ఏడాది ఆమె నటించిన మూడు సినిమాలు ఖచ్చితంగా ఆడియన్స్ ముందుకు రావడమైతే పక్కా. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్, నితిన్, వైష్ణవ తేజ్, నవీన్ పోలిశెట్టి, విజయ్ దేవరకొండ అబ్బో శ్రీలీల జోరు హుషారు ఎంత చెప్పినా తరిగేదే లేదు.

Advertisement
CJ Advs

ప్రస్తుతం బాలకృష్ణతో అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న శ్రీలీలని బాలయ్య చెంప చెళ్లుమనిపించారనే వార్త దావానలంలా సోషల్ మీడియాని చుట్టేసింది. NBK 108 లో బాలయ్యకి కూతురిగా నటిస్తున్న శ్రీలీలపై ఓ సన్నివేశంలో భాగంగా బాలయ్య చెయ్యి చేసుకున్నారట. శ్రీలీల బాలయ్యని కొట్టమనడం, ఆయన చెంప చెళ్లుమనిపించడంతో శ్రీలీల బావురుమనడంతో ఆ సీన్ రక్తికట్టింది అని తెలుస్తుంది.

ఈ సన్నివేశం చూసిన చిత్ర బృందం షాకైపోయిందట. అంత సహజంగా ఈ సన్నివేశం వచ్చింది అని చెబుతున్నారు. బాలయ్య-శ్రీలీల మధ్యలో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు NBK108 కి హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ బాలయ్య తో రొమాన్స్ చేస్తుంది.

Balakrishna slaps Sreeleela on cheeks:

 Nbk 108: Balakrishna Slapped Sree Leela 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs