Advertisement
Google Ads BL

మహేష్ జడ్జిమెంట్ పై నెటిజన్ల సెటైర్లు


సూపర్ స్టార్ మహేష్ బాబు జెడ్జిమెంట్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో సిల్లీ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆయన ఏదైనా సినిమా బావుంది అని సోషల్ లో ట్వీట్ చేస్తే ఆ సినిమాపై అంచనాలు, క్రేజ్ ఎలా పెరుగుతాయో ఇప్పుడో చిన్న సినిమా నిరూపించింది. గతంలో బ్లాక్ బస్టర్ చిత్రాలకి మహేష్ సోషల్ మీడియాలో ఇచ్చే రివ్యూస్, ట్వీట్స్ ప్రేక్షకులని ఇంప్రెస్స్ చేశాయి. ఏదైనా సినిమా చూసి మహేష్ బాబు దాని గురించి ట్వీట్ చేస్తే ఆటోమాటిక్ గా ఆ సినిమాపై హైప్ క్రియేట్ అవుతుంది.

Advertisement
CJ Advs

ఇప్పుడులానే చాయ్ బిస్కెట్ వారి మేమ్ ఫెమస్ సినిమా సూపర్ గా ఉంది.. కొత్త యాక్టర్స్ అంతా అద్భుతంగా చేసారంటూ సినిమా విడుదలకు ఒక రోజు ముందే మహేష్ బాబు వేసిన ట్వీట్ చూసిన ప్రేక్షకులు మేమ్ ఫెమస్ పై ఆసక్తి కనబరిచారు. అటు మేమ్ ఫెమస్ టీం కూడా మహేష్ ట్వీట్ ని వైరల్ చేస్తూ హడావిడి చేసారు. దానితో టికెట్స్ తెగుతాయని వారు భావించడం లో తప్పులేదు. కానీ మహేష్ బాబు కి ఆ సినిమా లో ఏం నచ్చిందో ఇప్పుడు ప్రేక్షకులకి అర్ధం కావడం లేదు. మేమ్ ఫెమస్ నేడు విడుదలై ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆ సినిమా చూసిన వారంతా మహేష్ జెడ్జిమెంట్ పై సెటేరికల్ కామెంట్స్ వదులుతున్నారు.

ఆ చిత్రంలో కామెడీ కొద్దిగా పర్వాలేదనిపించినా.. కొత్త యాక్టర్స్ ప్రేక్షకులకి త్వరగా కనెక్ట్ అవడం కష్టంగా ఉంది, అలాగే ఇంటర్వెల్ సన్నివేశాలు బావున్నా.. కొత్తదనం లేని కథ, కథనాలు, సాగదీత సన్నివేశాలు ప్రేక్షకులకి చిరాకు తెప్పించాయి, సినిమా అంతగా ఏమి లేదు అంటూ మేమ్ ఫెమస్ సినిమా చూసిన వారు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మహేష్ బావుంది అన్నాడు కదా అని టికెట్ కొని డబ్బులు వేస్ట్ చేశామంటూ మహేష్ జెడ్జిమెంట్ పై సిల్లీగా కామెంట్స్ చేస్తున్నారు మేమ్ ఫెమస్ చూసిన ఆడియన్స్.

Silly comments on Mahesh judgment:

Mahesh Babu Praises Mem Famous
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs