ఈటీవీలో ఢీ డాన్స్ షో అంటూ గత కొన్నేళ్లుగా పాపులర్ డాన్స్ షో ప్రతి బుధవారం డాన్స్ లవర్స్ ని ఇంప్రెస్స్ చేస్తోంది. ఢీ డాన్స్ షో తో పాపులర్ అయ్యి ఇప్పుడు డాన్స్ మాస్టర్స్ గా ఇండస్ట్రీలో నెంబర్ 1 పొజిషన్ లో కొనసాగుతున్నవారు చాలామంది ఉన్నారు. అయితే ఢీ డాన్స్ షో గ్రాండ్ ఫినాలే కి ప్రతిసారి ఓ స్టార్ హీరోని అయినా, లేదంటే ప్రభుదేవా లాంటి టాప్ కొరియోగ్రాఫర్స్ ని తీసుకొచ్చి ఆ ఫినాలే ఎపిసోడ్ కి హైప్ తీసుకొస్తుంది మల్లెమాల యాజమాన్యం.
జూనియర్ ఎన్టీఆర్, ప్రభుదేవా, రవితేజ, అల్లు అర్జున్ ఇలా చాలామంది స్టార్స్ ఢీ గ్రాండ్ ఫినాలేలో మెరిశారు. తాజాగా ఢీ 15 గ్రాండ్ ఫినాలేకి మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల రాబోతుంది. కాదు వచ్చేసింది. శ్రీలీల ఢీ 15 షో గ్రాండ్ ఫినాలేలో మెరిసిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పెళ్లి సందడి, ధమాకా సినిమాల్లో శ్రీలీల డాన్స్ కి ఫిదా కానీ తెలుగు ప్రేక్షకుడు లేదు. అందుకే అమ్మడి క్రేజ్ ని ఢీ యాజమాన్యం ఇలా వాడేస్తుంది.
ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన శ్రీలీల క్రేజ్ డెఫనెట్ గా ఢీ15 గ్రాండ్ ఫినాలే కి కలిసొస్తుంది. ఇక ఓ ఎపిసోడ్ లో కార్తికేయ, నేహా శెట్టి అతిధులుగా రాగా.. ఫినాలే ఎపిసోడ్ కి శ్రీలీల గెస్ట్ గా వచ్చింది. వచ్చే బుధవారం ఈ ఎపిసోడ్ ప్రసారం కాబోతుంది.