Advertisement
Google Ads BL

ఓటిటిలోకి వచ్చేసిన పొన్నియన్ సెల్వన్ 2


మణిరత్నం కళాఖండం పొన్నియన్ సెల్వన్ 2 ఏప్రిల్ 28 న థియేటర్స్ లోకి వచ్చింది. పొన్నియన్ సెల్వన్ 1 మూవీ వచ్చిన ఆరు నెలలకి మణిరత్నం పొన్నియన్ సెల్వన్ 2 ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేసారు. తమిళ ఆడియన్స్ కి తప్ప పొన్నియన్ సెల్వన్1 మిగతా లాంగ్వేజ్ ఆడియన్స్ ని అంత ఇంప్రెస్స్ చెయ్యలేదు. అయినప్పటికీ విక్రమ్, ఐష్, త్రిష, కార్తీ, జయం రవిలు పొన్నియన్ సెల్వన్2 ని గట్టిగా ప్రమోట్ చేసారు.

Advertisement
CJ Advs

ఇక థియేటర్స్ లో విడుదలై నెల రోజులవుతున్న పొన్నియన్ సెల్వన్ ఇప్పుడు ఓటిటిలోకి వచ్చేసింది. ఓటిటిలోకి వచ్చేసింది ఫ్రీగా చూసేద్దాం అని అనుకుంటున్నారేమో.. ఆ ఛాన్స్ అమెజాన్ ప్రైమ్ ఇవ్వడం లేదు. ఈరోజు నుండి అమెజాన్ ప్రైమ్ లో పొన్నియన్ సెల్వన్2 చూడాలంటే రెంట్ పద్దతిలో చూడాల్సిందే. భారీ డీల్ తో ఓటిటి హక్కులని చేజిక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ వారు నెల తిరక్కుండానే ఓటిటిలోకి తీసుకొచ్చినా రెంట్ విధానంలోనే ప్రేక్షకులకి ఈ చిత్రాన్ని అందుబాటులోకి తెచ్చారు.

ప్రైమ్ మెంబర్ షిప్ తో సంబంధం లేకుండా 399 చెల్లించి ఎవరైనా సరే సినిమా చూడొచ్చు. డబ్బులు పే చేసిన దగ్గర నుంచి 48 గంటల్లో మూవీ చూడాల్సి ఉంటుంది. ఇక ఫ్రీగా పొన్నియన్ సెల్వన్ 2 చూసెయ్యాలి అంటే మరో నెల రోజులు అంటే జూన్ 26 వరకు వెయిట్ చెయ్యాల్సిందే.

Ponniyin Selvan 2 who came to OTT:

Ponniyin Selvan-2 makes its OTT debut with a twist
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs