Advertisement
Google Ads BL

సోషల్ మీడియాలో పవిత్ర లోకేష్ రేర్ ఫీట్


టాప్ హీరోయిన్స్ కి సాధ్యమయ్యే ఫీట్ ని ఇప్పుడు సీనియర్ నటి పవిత్ర లోకేష్ సాధిస్తుంది. పవిత్ర లోకేష్ కేరెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంత ఫెమసో.. ఈమధ్య కాలంలో సీనియర్ హీరో నరేష్ తో పెళ్లి విషయంలోనూ అంతే హాట్ టాపిక్ అయ్యింది. సీనియర్ నరేష్ తో కొంతకాలంగా సహజీవనం చేస్తున్న పవిత్ర లోకేష్ అతి త్వరలోనే(రమ్య రఘుపతితో నరేష్ కి విడాకులు రాగానే) నరేష్ తో వివాహానికి రెడీ అవుతున్న తరుణంలోనే మళ్ళీ పెళ్లి అంటూ నరేష్-పవిత్ర కీలకంగా కనిపించబోతున్న సినిమా రేపు శుక్రవారం విడుదల కాబోతుంది.

Advertisement
CJ Advs

మళ్ళీ పెళ్లి ప్రమోషన్స్ లో భాగంగా నరేష్-పవిత్ర లోకేష్ చేస్తున్న హడావిడి, పబ్లిక్ రొమాన్స్, వారి మధ్యన ఎంత సాన్నిహిత్యం ఉందో అనేది అందరికి ప్రూవ్ చేస్తున్నారు. ఈ రకంగా పవిత్ర లోకేష్ గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. టాప్ హీరోయిన్స్ ఏ సినిమా ప్రమోషన్స్ లోనో, లేదంటే ఏదైనా కాంట్రవర్సీలలో లోనో, లేదంటే కొత్త అవుట్ ఫిట్స్ తో మెసరైజ్ చేసినప్పుడో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉండడం చూస్తుంటాం.

కానీ పవిత్ర లోకేష్ ఇలా మళ్ళీ పెళ్లి విషయంలో తరచూ ట్రెండ్ అవడం చూస్తే నిజంగా ఆమె రేర్ ఫీట్ సాధించింది అనే చెప్పాలి. ఈ వయసులోనూ ఆమె చాలా యాక్టీవ్ గా నరేష్ తో ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయి డాన్స్ చేస్తుంటే.. ఇలానే ఆమెని చూడడానికి జనాలు ఎగబడతారు. అలా వైరల్ అవుతారు.. అంటూ నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు.

Pavitra Lokesh Rare Feat on Social Media:

PavitraLokesh hashtag trends on twitter
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs