Advertisement
Google Ads BL

సైలెంట్ గా సంక్రాంతి డైరెక్టర్స్


సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి-నందమూరి బాలకృష్ణలు వాల్తేర్ వీరయ్య-వీరసింహారెడ్డి లతో హిట్స్ కొట్టారు. ఆ తర్వాత అనిల్ రావిపూడితో బాలయ్య, మెహర్ రమేష్ తో మెగాస్టార్ చిరు తదుపరి చిత్ర షూటింగ్స్ తో బిజీ అయ్యారు. ఈ రెండు సినిమాల్లో భోళా శంకర్ ఆగష్టు 11న రాబోతుంటే.. బాలకృష్ణ-అనిల్ రావిపూడిల్ NBK 108 చిత్రం దసరా కి రాబోతుంది. బాలయ్య-చిరు అలా నెక్స్ట్ మూవీస్ తో బిజీ అయ్యారు.

Advertisement
CJ Advs

కానీ సంక్రాంతి బరిలో నువ్వా - నేనా అని పోటీ పడిన దర్శకుడు బాబీ-దర్శకుడు గోపీచంద్ మలినేని లు తదుపరి చిత్రాలపై క్లారిటీ రావడమే లేదు. ఇద్దరూ మైత్రి మూవీస్ లోనే తదుపరి చిత్రాలు చేసే ఛాన్స్ వుంది. కానీ ఏ హీరోలతో చేస్తారో అనేది చెప్పడం కష్టం. వాల్తేర్ వీరయ్యతో మంచి హిట్ కొట్టిన బాబీ సూపర్ స్టార్ రజినీకాంత్ తో తదుపరి సినిమా అనే ప్రచారం జరిగినా అది పక్కాగా స్పష్టత లేదు.

ఇక గోపీచంద్ మలినేని క్రాక్ అంత హిట్ అవ్వకపోయినా వీరసింహారెడ్డి కూడా పర్లేదనిపించుకుంది. ఇప్పుడు గోపీచంద్ ఏ హీరోకి కథ వినిపించి ఓకె చేయించుకుంటాడో అనే క్యూరియాసిటీ అయితే ప్రేక్షకుల్లో ఉంది. సంక్రాంతి అయ్యి ఆరు నెలలైంది. ఇంతవరకు ఈ ఇద్దరు దర్శకులు సినిమా మొదలు పెట్టలేదు. హిట్ కొట్టిన దర్శకులు ఇమ్మిడియట్ గా మరో సినిమా స్టార్ట్ చెయ్యకపోతే చాలా గ్యాప్ వచ్చేస్తుంది అనేది చాలామంది దర్శకులని చూస్తే తెలుస్తుంది.

Silent Sankranti Directors:

Bobby and Gopichand Malineni in silent mode
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs