Advertisement
Google Ads BL

గట్టిగానే కౌంటర్ ఇచ్చిన హరీష్ శంకర్


హరీష్ శంకర్ అంటే ఫైర్ బ్రాండ్. తనని కెలికినవాడిని మాములుగా వదలడు. మాటలతో చీల్చి చెండాడుతాడు. తనజోలికి వచ్చిన వారికి స్వీట్ గానే కౌంటర్ వేసే హరీష్ శంకర్ ఇప్పుడో జర్నలిస్ట్ కి మొహం పగిలేలా కౌంటర్ వెయ్యడం మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. జనరల్ గా రఫ్ గా సమాధానం చెప్పే హరీష్ శంకర్ కి సదరు జర్నలిస్ట్ వేసిన ప్రశ్నకి బాగా కాలింది. దానితో ఆ జర్నలిస్ట్ కి ఎడా పెడా ఇచ్చిపడేసాడు.

Advertisement
CJ Advs

రీసెంట్ గా మలయాళంలో సూపర్ హిట్ అయిన 2018 ఫిల్మ్ ని బన్నీ వాస్ తెలుగులో డబ్ చేసి.. జర్నలిస్ట్ లకి స్పెషల్ ప్రీమియర్స్ వేసాక మీడియా మీట్ నిర్వహించారు. ప్రెస్ షో అయ్యాక మీడియా మీట్ లో సదరు జర్నలిస్ట్ నిర్మాత బన్నీ వాస్ ని టార్గెట్ చేస్తూ.. మీరు ఈ సినిమా చూసాక మన తెలుగు డైరెక్టర్స్ ఇలా తియ్యగలరా.. మన తెలుగు నిర్మాతలు ఈ సాహసం చెయ్యగలరా అనే ఫీలింగ్ మీకు కలిగిందా అని ప్రశ్నించాడు.

దానికి బన్నీ వాస్ మీరు డైరెక్టర్ గారినే ఆ ప్రశ్న అడగండి అని హరీష్ శంకర్ కి మైక్ ఇచ్చేసాడు. హరీష్ మాట్లాడుతూ.. ఏంటండీ సాహసోపేతమైన ప్రశ్న వేసి యూట్యూబ్ లో వైరల్ అవ్వాలనుకుంటున్నారా అంటూ స్మూత్ గా గడ్డి పెడుతూ.. ప్రపంచ సినిమా అరచేతుల్లోకి వచ్చాక ఇంకా డబ్బింగ్ సినిమాలు ఏంటండీ. హిందీలో ఆర్.ఆర్.ఆర్ ని బాహుబలిని, కెజిఫ్ ని ఎవరైనా డబ్బింగ్ సినిమాలు అనుకున్నారా.. ప్రపంచమే తెలుగు సినిమా వైపు చూస్తుంది. డబ్బింగ్ సినిమా, రీమేక్ సినిమా అని ఏమి లేవు. సినిమా అంతే. డబ్బింగ్ సినిమాలు చెయ్యడంలో తప్పులేదు. 

ఒక మంచి సినిమాని ప్రేక్షకులకి చూపించాలనేదే నా కోరిక. నాకు నచ్చితే ఆ సినిమా పదిమంది చూసి సంతోషించాలని అనుకుంటాను అంటూ హరీష్ శంకర్ జర్నలిస్ట్ పై స్మూత్ గానే ఫైర్ అయ్యాడు.

Harish Shankar gave a strong counter:

Harish Shankar strong counter to the journalist
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs