అక్కినేని నాగార్జున కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉంటున్నారు. గత ఏడాది బిగ్ బాస్ ముగిసాక ఆయన మీడియాలో చాలా తక్కువగా కనిపించారు. ది ఘోస్ట్ ప్లాప్ తర్వాత ఆయన కొత్త సినిమా అనౌన్సమెంట్ కూడా లేదు. ఘోస్ట్ తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకోబోతున్నాని చెప్పి కూడా ఏడెనిమిది నెలలు అయ్యింది. కానీ అయన తదుపరి సినిమా ప్రకటన అఫీషియల్ గా రాలేదు.
నాగార్జున ఎవరితో సినిమా చేస్తారో అర్ధం కాక అక్కినేని ఫాన్స్ కొట్టేసుకుంటున్నారు. ఆయన మలయాళ రీమేక్ ని ఎంచుకుంటారా.. లేదంటే కొత్త దర్శకుడితో పని చేస్తారా అనేది తెలీడం లేదు. ఈలోపులో నాగార్జున కొత్త చిత్రానికి ముహూర్తం కుదిరింది. జూన్ రెండో వారంలో నాగార్జున కొత్త సినిమాకి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. జులై మొదటి వారం నుండి రెగ్యులర్ షూట్ కి వెళ్తుంది అంటున్నారు.
మరి నాగార్జున ఎలాంటి నేపథ్యంలో సినిమా చేస్తున్నారు, ఎవరితో సినిమా చేస్తున్నారు, థ్రిల్లర్ మూవీస్ నాగ్ కి అచ్చిరావడం లేదు. సో నాగ్ ఎలాంటి నేపథ్యంతో తన నెక్స్ట్ సినిమా మొదలు పెట్టబోతున్నారో అనే సస్పెన్స్ మరికొద్దిరోజుల్లో కంటిన్యూ అయ్యేలా కనిపిస్తుంది.