దేశముదురు తో టాలీవుడ్ లోకీ ఎంట్రీ ఇచ్చి.. ఇక్కడ స్టార్ ఛాన్సెస్ వచ్చినా టాప్ హీరోయిన్ గా నిలదొక్కుకోలేక కోలీవుడ్ కి బిచాణా ఎత్తేసిన పాలబుగ్గల హన్సిక అక్కడికి వెళ్ళాక శింబు తో ప్రేమాయణం నడిపి బ్రేకప్ చేసుకుని కెరీర్ పై ఫోకస్ పెట్టింది. కోలీవుడ్ లో అభిమానులు హన్సికకి గుడి కట్టేసారు. అయితే గత ఏడాది ప్రేమించిన వాడిని పెళ్లాడిన హన్సిక గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. రోజు రోజుకి గ్లామర్ పరంగా సరికొత్త పుంతలు తొక్కుతుంది.
తాజాగా హన్సిక టాలీవుడ్ హీరోల అబిమానుల చేతిలో ట్రోల్ అవుతుంది. కారణం తనని టాలీవుడ్ హీరో వేధింపులకు గురి చేశాడంటూ ఓ సందర్భంలో మాట్లాడింది అని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దానితో హన్సికని దేశముదురు హీరో అల్లు అర్జున్ వేధించాడా.. లేదంటే కంత్రి హీరో ఎన్టీఆర్ వేధించాడా.. ప్రభాస్ వేధించాడా అంటూ అందరి మనస్సుల్లో మొదలైన ప్రశ్న. అవే మీమ్స్ రూపంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
దీనితో హన్సిక రంగంలోకి దిగి టాలీవుడ్ లో నేను క్యాస్టింగ్ కౌచ్ ఫేస్ చేశాను అని ఎప్పుడు చెప్పాను, నన్ను ఓ హీరో వేధించాడని నేను చెప్పినట్టుగా రాసారు. నేను మాట్లాడనిది మాట్లాడినట్టుగా ఎందుకు రాస్తారు. ముందు వాస్తవాలు తెలుకోండి. నిజానిజాలు తెలుసుకోండి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కామెంట్స్ లో నేను ఏది చెప్పలేదు, నేను ఏ హీరోపై మాట్లాడలేదు, ముందు అన్నీ తెలుసుకుని న్యూస్ పబ్లిష్ చెయ్యండి అంటూ హన్సిక ఫైర్ అవుతూ పోస్ట్ పెట్టింది.