గత నాలుగు రోజులుగా అనసూయ భరద్వాజ్ తన ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్న ప్రతి మూమెంట్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కావడంతో భర్త భరద్వాజ్, పిల్లలిద్దరితో కలిసి ఈ సమ్మర్ వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తుంది అనసూయ. ఆ వెకేషన్స్ లో స్విమ్ చేసినా, బ్రేక్ ఫాస్ట్ తిన్నా, సాయంత్రం వేళలో నదీ తీరాన స్పెండ్ చేస్తున్నా ఆ ఫొటోస్ ని షేర్ చేస్తుంది.
నిన్నటివరకు ఫ్యామిలీ పిక్స్ ని పంచుకున్న ఆమె నేడు సింగిల్ పిక్ తో హొయలు పోయింది. బుల్లి నిక్కరుతో అనసూయ భరద్వాజ్ రచ్చ చేసింది. Today, I am learning to be me.. everyday all over again. #SelfAffirmation❤️ #GoodMorning అంటూ క్యాప్షన్ పెట్టింది. తనని పాపులర్ చేసిన యాంకరింగ్ ని పక్కనబెట్టి మరీ అనసూయ సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఇప్పటికే రంగస్థలం, పుష్ప 1, రంగమార్తాండ చిత్రాలతో సత్తా చాటిన అనసూయ తాజాగా విమానంతో మరోసారి తన నటనా ప్రావీణ్యాన్ని చూపించాడనికి రెడీ అవుతుంది.
సుమతి పాత్రలో అనసూయ విమానంతో ఇంకోసారి రంగమ్మత్త పాత్రని గుర్తు చేసింది. ప్రస్తుతం అనసూయ నటించిన విమానం విడుదలకు రెడీ అవుతుండగా.. పుష్ప 2 షూటింగ్ లో అనసూయ త్వరలోనే పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది.