యంగ్ టైగర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు రాకపోవడంపై చాలా విమర్శలొచ్చాయి. నందమూరి రామకృష్ణ, కమిటీ మెంబర్స్ తారక్ ఇంటికి వెళ్లి ఆహ్వానించినా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ రాకపోవడాన్ని నందమూరి ఫాన్స్ తప్పుబట్టడమే కాదు లోలోపల మధనపడ్డారు. తాత గారు, తాతగారు అని చెప్పడం కాదు.. ఆ తాతకి మనవడివైనందుకు ఋణం తీర్చుకోవాలి, అందుకు తగ్గట్టు నడుచుకోవాలంటూ సలహాలూ ఇచ్చారు. అయితే తారక్ ఇంటికి పెదనాన్న రామకృష్ణ-కమిటీ సభ్యులు వెళ్లి పిలిచారు. ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా.
కానీ అక్కడ ఏం జరిగి ఉంటుందో ఎవ్వరూ ఊహించనైనను లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ సెంచరీ సెలెబ్రేషన్స్ కి ఆహ్వానించడానికి వెళ్ళినవారు మీరు తప్పకుండా రావాలని పిలవలేదట. మీరొస్తే బాలకృష్ణ గారికి నచ్చదు, కానీ చంద్రబాబు మిమ్మల్ని ఆహ్వానించమన్నారు కాబట్టి మిమ్మల్ని పిలుస్తున్నాము అన్నట్టుగా తారక్ కి, కళ్యాణ్ రామ్ కి చెప్పడంతో బాబాయ్ కి ఇష్టం లేకుండా మేమెందుకు రావడం అన్నట్టు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో వాళ్లిద్దరూ కనిపించలేదు అనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట.
తారక్ పట్ల మొదటినుండి బాలయ్య కాస్త అన్యమనస్కంగానే ఉంటాడనే విషయం చాలా సందర్భాల్లో స్పష్టమైంది. అయితే కళ్యాణ్ రామ్ ని అభిమానించే బాలకృష్ణ అతన్ని దూరం పెట్టడానికి కారణం కూడా తారక్ అని తెలుస్తోంది. తారక్ తో కళ్యాణ్ రామ్ క్లోజ్ గా ఉండడం, తారక్ సినిమా నిర్మాతల్లో పార్ట్నర్ గా మెలగడం వంటి విషయాలు బాలయ్యకి నచ్చడం లేదని.. అందుకే ఎన్టీఆర్ సెంచరీ సెలెబ్రేషన్స్ కి తారక్ తో పాటు కళ్యాణ్ రామ్ కి ఆహ్వానం పంపినా బాలయ్య కి ఇష్టం లేని కారణంగానే వారు ఆ ఈవెంట్ కి దూరంగా ఉన్నారనేది బలంగా వినిపిస్తున్న మాట. ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న చర్చ.
తారక్ - కళ్యాణ్ రామ్ లు నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలకు దూరంగా ఉండడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమి లేవు.. బాలయ్య బాబాయ్ కోరిక మేరకే వాళ్ళు ఇలా ఆ సెలెబ్రేషన్స్ లో పాలు పంచుకోలేకపోయారేనేది ఇప్పుడు నందమూరి అభిమానులు జీర్ణించుకోవాల్సిన విషయం.. అర్ధం చేసుకోవాల్సిన అంశం.!