Advertisement
Google Ads BL

పారితోషికాలపై శృతి హాసన్ సంచలన వ్యాఖ్యలు


ఈమధ్యన హీరో-హీరోయిన్స్ సమానమైన పారితోషకాలు ఇవ్వాలంటూ చాలామంది హీరోయిన్స్ గళమెత్తుతున్నారు. స్టార్ హీరోలతో సమానమైన పారితోషకం అందుకోవడానికి 20 ఏళ్ళు పట్టింది అంటూ ప్రియాంక చోప్రా చేసిన కామెంట్స్ వైరల్ అవ్వగా.. హీరోలతో సమానంగా కష్టపడుతున్నాము, ఆ కష్టాన్ని గుర్తించి నిర్మాతలు హీరోయిన్స్ కి రెమ్యునరేషన్  ఇవ్వాలంటూ సమంత కామెంట్స్ చేసింది. ఒక సినిమాలో హీరో కి ఎంత ఇంపోర్టన్స్ ఉందో.. హీరోయిన్స్ కి అంతే ఉంది. కానీ పారితోషకాల విషయంలో హీరోలకి ఒకలా హీరోయిన్స్ కి ఒకలా ఇదెక్కడి న్యాయమంటూ రకుల్ ప్రీత్ రీసెంట్ గా మాట్లాడింది.

Advertisement
CJ Advs

ఇప్పుడు కోలీవుడ్ భామ శృతి హాసన్ కూడా అదే మాట్లాడుతుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో క్రేజీ ప్రాజెక్స్ తో దూసుకుపోతున్న శృతి హాసన్ తాజాగా కాన్స్ మూవీ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై మెరిసింది. అక్కడ ఆమెకి పారితోషకాలపై ప్రశ్న ఎదురవగా.. శృతి హాసన్ మాట్లాడుతూ.. ఈ విషయంలో ప్రియాంక చోప్రా అద్భుతం సాధించారు. మేము ఇప్పటికి కష్టపడుతున్నాము, మన దగ్గర హీరో-హీరోయిన్స్ కి సరిసమానమైన రెమ్యునరేషన్ గురించి కనీసం చర్చించుకోరు. 

కానీ హీరోలతో సమానంగా కనిపించే హీరోయిన్స్ కి కూడా సమానమైన పారితోషకం రావాలని కోరుకుంటున్నాను. ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను అంటూ పారితోషకాలపై శృతి హాసన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Shruti Haasan Sensational Comments on Remuneration:

Shruti Haasan reveals her experience with pay inequality
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs