Advertisement
Google Ads BL

అయ్యయ్యో గంగవ్వ ఛానల్ గుట్టు విప్పేసింది


పల్లెటూరు నుండి వీడియోస్ తో ఫెమస్ అయ్యి తర్వాత బిగ్ బాస్ తో బుల్లితెర ప్రేక్షకులకి దగ్గరయింది.. గంగవ్వ చాలా సినిమాల్లో నటించింది కూడా. అలా ఫెమస్ అయ్యి నాగార్జున గారు సహాయం, బిగ్ బాస్ పైకం తో ఓ ఇల్లు కట్టుకున్న గంగవ్వ ని ఇప్పుడు రాజకీయాల్లోకి లాగి ఆడేసుకుంటున్నాడు. గంగవ్వ ఛానల్ లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని నానా మాటలు అనింది. ఓ టీవీ చానల్‌ జాతకం పేరుతో నిర‍్వహించిన ప్రోగ్రాంలో గంగవ్వ పాల్గొంది. ఇందులోకి గంగవ్వను తీసుకువచ్చి ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు, ఏపీకి ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన, ప్రస్తుతం ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేయించారు. కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు జాతకం బాగాలేదని గంగవ్వతో నిర్వాహకులు చెప్పించారు.

Advertisement
CJ Advs

అయితే తాజాగా గంగవ్వ తన చేత టివి వాళ్లే ఆ మాటలు అనిపించారంటూ ఆ ఛానల్ భాగోతాన్ని బయటపెట్టింది. మీ అందరికి నమస్కారము. నాతో ఎవరైనా ఏదైనా చెబితేనే కానీ నేను అంటాను. నాకు అనటం రాదు. నేను చదువుకోలేదు గదయ్యా, నా కష్టం సుఖం అందరికి చెప్పినాను, చంద్రబాబు నాయుడు సర్ ని టివి ఛానల్స్ వాళ్ళు వచ్చి అనిపిస్తేనే అన్నాను, దానిని తప్పుపట్టుకోకండ్రి, దయచేసి క్షమించండి, నాకు మాట్లాడడం రాదు. తప్పుపట్టుకోకండ్రి.. అంటూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో వదిలింది.

అది చూసిన టిడిపి కార్యకర్తలు.. ఇదేమి దిగజారుడు? మీ పబ్బం గడుపుకోవడానికి గంగవ్వ లాంటి అమాయకురాలిని ఎందుకు బలిచేస్తారు? జగన్ మెప్పు పొందడం కోసం, అమాయకురాలైన గంగవ్వ తో చంద్రబాబు నాయుడు గారిని మాటలు అనిపించిన బులుగు మీడియా.. తనతో ఛానల్ వాళ్ళు బలవంతంగా చెప్పించారు అంటూ కామెంట్స్ చేస్తూ గంగవ్వ వీడియోని స్ప్రెడ్ చేస్తున్నారు.

Gangavva Says Sorry to Chandrababu Naidu:

Gangavva Says Sorry to TDP President Chandrababu Naidu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs