గత కొన్నాళ్లుగా అంటే కరోనా సమయంలో, ఓటిటీ హవా పెరిగాక పెద్ద స్టార్స్ సినిమాల కలెక్షన్స్ ని నిర్మాతలు ప్రత్యేకించి పోస్టర్స్ వేసి ప్రకటించుకుంటున్నారు. ఒరిజినల్ లెక్కలనే ధైర్యంగా బయటపెట్టలేక ఇలా పోస్టర్స్ వేసి మ్యానేజ్ చేస్తున్నారు. ఒకప్పుడు సినిమాల ఓపెనింగ్స్, ఫస్ట్ వీకెండ్, ఫస్ట్ వీక్, 15 డేస్, 25 డేస్ లెక్కలు, 50 డేస్ లెక్కలు, 100 డేస్ కలెక్షన్స్ అని మట్లాడుకునేవారు. కానీ కరోనా పాండమిక్ సిట్యువేషన్ ఈలెక్కల తప్పుల తడకని హేళన చేసింది. ఇప్పుడు భారీ సినిమాలకే కలెక్షన్స్ ఓపెన్ గా చెప్పాలంటే జంకుతున్నారు.
అలాంటిది స్టార్ హీరోల రీ రిలీజ్ ల లెక్కలు ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద తలనొప్పిగా మారాయి. అల్లు అర్జున్, మహేష్ బాబు, పవన్ కల్యాణ్, ప్రభాస్, రాంచరణ్, ఎన్టీఆర్ లు నటించి, బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు, క్రేజీ సినిమాలని వారి బర్త్ డే అకేషన్స్ కి విడుదల చేస్తూ ఫాన్స్ చేస్తున్న రచ్చ కాస్త అతిగా మారింది. మా హీరోకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయంటే మా హీరోకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయంటూ కొట్లాట స్టార్ట్ చేసారు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రిలీజైన సింహాద్రి సినిమా భారీ వసూళ్లను సాధించింది. రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం రీ రిలీజ్ లోను నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది.
ఇది పవన్ ఫాన్స్ కడుపు రగిలించింది. మెగా, నందమూరి ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో భారీ ఫైట్ మొదలైంది. ఇప్పటి వరకు సింహాద్రి చిత్రం ఖుషీ సినిమా కలెక్షన్లను దాటలేకపోయింది అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతూ ఎన్టీఆర్ ఫాన్స్ ని రెచ్చగొడుతున్నారు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా పవన్ ఫాన్స్ కి ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే ఈ కలెక్షన్ల వార్ చూసిన ప్రేక్షకులు నవ్వుకుంటున్నారు. అసలు భారీ బడ్జెట్ సినిమాల కలెక్షన్స్ కే నిజమైన లెక్కలు తేలని ఈ సమయంలో రీ రిలీజ్ ల కలెక్షన్స్ విషయంలో ఇంత గోల అవసరమా..
ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు. పవన్ ఫాన్స్ vs ఎన్టీఆర్ ఫాన్స్ మధ్యలో ఇప్పుడు పచ్చగడ్డి వేస్తె భగ్గుమనేలా ఉంది పరిస్థితి. కొంతమంది మీడియా మిత్రులు కూడా పవన్ సైడ్ తీసుకోవడం కూడా మరింత చర్చినీయాంశం అయ్యింది. అంటే దీని వెనుక ఎవరో ఉండి కథ నడిపిస్తున్నారేమో అనే అనుమానాలు నెటిజెన్స్ వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు సరదాపడి రీ రిలీజ్ లు చేసుకుని సంబరపడకుండా.. ఈ కలెక్షన్స్ యుద్ధం నిజంగా అవసరమా.. ఇప్పుడు ఈ రీ రిలీజ్ ల లెక్కల విషయంలో ఏది కరెక్ట్ అనేది ప్రశ్నార్థకంగా మారింది.