Advertisement
Google Ads BL

అడ్డంగా ఇరుక్కున్న డింపుల్ హయతి


ఈరోజు ఉదయం నుండి తెలుగు హీరోయిన్ డింపుల్ హయతి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. కారణం తన బాయ్ ఫ్రెండ్ డేవిడ్ తో కలిసి ఓ ఐపీఎస్ అధికారి కారుని కాలుతో తన్ని తన కారుతో ఢీ కొట్టడమే. జూబ్లీహిల్స్ లోని జర్నలిస్ట్ కాలనీలో ఒకే అపార్ట్మెంట్ లో ఉంటున్న డింపుల్ కి రాహుల్ హెగ్డే అనే ఐపీఎస్ అధికారికి మధ్యలో కారు పార్కింగ్ గొడవ ఇప్పుడు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో ఉంది. 

Advertisement
CJ Advs

రాహుల్ డ్రైవర్ డింపుల్ పై కేసు పట్టడం.. అందులో నాదేమీ తప్పు లేదు, అధికారం ఉంది కదా అని ఏది బడితే అది చేస్తే ఒప్పైపోదు, సత్యమేవజయతే అంటూ డింపుల్ సోషల్ మీడియాలో ట్వీట్స్ చెయ్యడం, డింపుల్ లాయర్ మా మేడం ది తప్పేమి లేదు అంటూ మీడియా మీట్ లో చెప్పడం అబ్బో ఈవ్యవహారం ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. అయితే డింఫుల్ హయతి మాత్రం నేను డీసీపీని ఎప్పుడూ ఇబ్బందిపెట్టలేదు.. పబ్లిక్‌ ప్రాపర్టీని తీసుకొచ్చి ప్రైవేట్‌ ప్రాపర్టీలో పెట్టారు అంటూ ఆరోపిస్తుంది. 

దానికి రాహుల్ హెగ్డే మాట్లాడుతూ.. నేను, డింపుల్‌ ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాం.. నా కారుకు అడ్డంగా డింపుల్‌ కారు పెట్టారు.. నాకు అర్జెంట్‌గా బయటకు వెళ్లే పని ఏర్పడింది.. వ్యక్తిగతంగా వెళ్లి కారు తీయాలని రిక్వెస్ట్‌ చేశాను.. కారును ఢీకొట్టి, కాళ్లతో తన్నింది, నా పట్ల డింపుల్‌ ప్రవర్తన తీవ్ర అభ్యంతరకరం.. నేను ఎక్కడా తప్పు చేయలేదు.. డింపుల్‌ చేసిన ట్వీట్‌ పూర్తిగా అభ్యంతరకరం అంటూ రాహుల్ హెగ్డే ఆరోపిస్తున్నారు. 

ఈమధ్యలో డింపుల్ రాహుల్ కారుని కాలితో తన్నిన సీసీ టివి ఫుటేజ్ బయటికి రావడంతో జూబ్లీహిల్స్ పోలీసులు డింపుల్ హయతిపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి నోటీసులు పంపించారు.

Dimple Hayathi reacts to the controversy:

DCP Rahul Hegde Reacts Over Dimple Hayathi Issue
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs