ఎన్టీఆర్ అభిమానులు అత్యుత్సాహం ఇప్పుడు వారిని కటకటాల పాలు చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాన్స్ తాము చేసిన ఓ వెధవ పని వలన కటకటాలపాలైన ఘటన మచిలీపట్నంలో చోటు చేసుకుంది. సింహాద్రి రీ రిలీజ్ లో భాగంగా ఎన్టీఆర్ ఫాన్స్ చేసిన రచ్చతో విజయవాడలోని అప్సర థియేటర్ తగలబడగా.. ఎన్టీఆర్ ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేసిన ఘటనలో మచిలీపట్నంలోని ఎన్టీఆర్ ఫాన్స్ అరెస్ట్ అయ్యారు. విజయవాడ లోని అప్సర థియేటర్ లో ఎన్టీఆర్ ఫాన్స్ బాణాసంచా కాల్చడంతో థియేటర్ లోని సీట్స్ కాలిపోయాయి.
అయితే ఎన్టీఆర్ ఫాన్స్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సింహాద్రి రిలీజ్ అవడంతో మచిలీపట్నంలోని రెండు థియేటర్స్ దగ్గర యాటపోతులని బలి ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. రెండు మేకపోతులని నరికి ఆ రక్తాన్ని ఎన్టీఆర్ ఫ్లెక్సీలపై పోసి రక్తాభిషేకం చేసారు. మరి ఇలా మేకలని నరికి రక్తం చిందించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో వెంటనే ఎన్టీఆర్ ఫాన్స్ ని మచిలీపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అక్కడ రక్తపాతం చెయ్యడమే కాకుండా, ప్రేక్షకులని భయబ్రాంతులకు గురి చేసిన ఎన్టీఆర్ ఫాన్స్ ని పోలీస్ లు అరెస్ట్ చేసారు. అభిమానం అనేది గుండెల్లో ఉండాలి.. ఇలా ఏటపోతులని బలి ఇచ్చి అతి చేస్తే జైలు పాలవ్వక ఏమవుతారు అంటూ నెటిజెన్స్ ఎన్టీఆర్ ఫాన్స్ అత్యుత్సాహంపై కామెంట్స్ చేస్తున్నారు.