గత కొద్దిరోజులుగా కీర్తి సురేష్ పెళ్లి టాపిక్ సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చక్కర్లు కొడుతోంది. కీర్తి సురేష్ ఓ బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకోబోతుంది.. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుంది అంటూ ఆ న్యూస్ సారాంశం. ఈమధ్యన ఓ వ్యక్తితో క్లోజ్ గా ఉన్న పిక్స్ షేర్ చెయ్యడమే కాదు.. ఆ పిక్స్ లో కీర్తి సురేష్ సదరు వ్యక్తి ఒకే కలర్ డ్రెస్సులు వేసుకుని కనిపించారు. అతనికి స్వీట్ గా బర్త్ డే విషెస్ కూడా చెప్పడంతో కీర్తి పెళ్లాడబోయేది అతన్నే అంటూ చాలామంది ఫిక్స్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
తాజాగా కీర్తి సురేష్ తన పెళ్లి వార్తలపై డైరెక్ట్ గానే స్పందించింది. ఈసారి నా బెస్ట్ ఫ్రెండ్ ని ఈ రకంగా వార్తల్లోకి తీసుకొచ్చారు? నా లైఫ్ లో నిజమైన మిస్టరీ మ్యాన్ ని టైమ్ వచ్చినప్పుడు బయటపెడతాను. అప్పటివరకు కూల్ గా ఉండండి అంటూ తన జీవితంలో మిస్టరీ మ్యాన్ ఉన్నాడని కీర్తి సురేష్ కన్ ఫర్మ్ చేసింది. అలాగే మొన్న కీర్తితో కనిపించిన వ్యక్తి మాత్రం కీర్తి సురేష్ బాయ్ ఫ్రెండ్ కాదనేది కూడా ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చేసింది.