Advertisement
Google Ads BL

కేసుపై స్పందించిన డింపుల్ హయాతి


డింపుల్ హయాతి వివాదంలో చిక్కుకుంది. ఈరోజు ఉదయం డింపుల్ హయతిపై క్రిమినల్ కేసు నమోదు అంటూ మీడియాలో న్యూస్ చూసిన వారు షాకయ్యారు. ఒకే అపార్ట్మెంట్ లో కలిసి ఉంటున్న ట్రాఫిక్ సెక్షన్ లో పనిచేసే ఐపీఎస్ ఆఫీసర్ రాహుల్ కారుని కావాలనే డింపుల్ హయాతి ఆమె బాయ్ ఫ్రెండ్ డేవిడ్ గుద్దారని, అంతేకాకుండా రాహుల్ డ్రైవర్ ని తిడుతూ రచ్చ చెయ్యడంతో రాహుల్ డ్రైవర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. జూబ్లీహిల్స్ పోలీసులు డింపుల్ ఆమె ఫ్రెండ్ డేవిడ్ పై క్రిమినల్ కేసు నమోదు చేసారు.

Advertisement
CJ Advs

కారు పార్కింగ్ విషయంలో తలెత్తిన గొడవలు, ఐపీఎస్ ఆఫీసర్ రాహుల్ కారుని ఉద్దేశ్యపూర్వకంగానే డింపుల్ ఆమె బాయ్ ఫ్రెండ్ డేవిడ్ కాలితో తన్ని, కారుని ఢీ కొట్టడంతో డింపుల్ పై ఆమె ఫ్రెండ్ డేవిడ్ పై కేసు నమోదు చేసారు. రాహుల్ డ్రైవర్ అక్కడ జరిగిన గొడవకు సంబందించిన సీసీ టివి ఫుటేజ్ కూడా పోలీసులకి అందించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కేసుపై డింపుల్ హయాతి కాస్త వెటకారంగా, ఇండైరెక్ట్ గా స్పందించింది.

అధికారాన్ని ఉపయోగించి, తప్పులని కప్పిపుచ్చుకోలేరంటూ.. సత్యమే గెలుస్తుంది, Using power doesn’t stop any mistake. 😂 Misuse of power doesn’t hide mistakes .. 😂. #satyamevajayathe అంటూ డింపుల్ హయాతి సోషల్ మీడియా వేదికగా తనపై కేసు విషయంలో ఇండైరెక్ట్ గా పోస్ట్ లు పెట్టింది.

Dimple Hayathi responded to the case:

Case filed against actress Dimple Hayathi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs