Advertisement
Google Ads BL

మహేష్ పై సోషల్ మీడియాలో నెగిటివిటి


మహేష్ బాబు లాంటి సున్నితమైన హీరో రాజమౌళి లాంటి పని రాక్షసుడితో పని చెయ్యగలుగుతాడా.. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఆర్.ఆర్.ఆర్ యాక్షన్ సీన్స్ లో ఎంతగా కష్టపడ్డారో.. ఎంతగా ఒళ్ళు నలగ్గొట్టుకున్నారో అనేది RRR మేకింగ్ లో చూసాం, ఇంటర్వూస్ లో విన్నాం. కాస్త రెస్ట్ తీసుకుందామన్నా రాజమౌళి కుదరదని గొడ్డులా పని చేయించాడంటూ ఎన్టీఆర్ చాలా సందర్భాల్లో చెప్పాడు. మండు టెండలో షూటింగ్ చెయ్యాలంటే ఆలోచించే మహేష్, ఆరు దాటితే సెట్స్ లో కనిపించని మహేష్ రాజమౌళి సినిమాని ఎలా హ్యాండిల్ చేస్తాడో.. రాజమౌళి మహేష్ తో సినిమా ఎలా చేయించుకుంటాడో అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి.

Advertisement
CJ Advs

ఇప్పుడు కొంతమంది పనిగట్టుకుని మహేష్ పై సోషల్ మీడియాలో నెగెటివిటీని ప్రచారం చేస్తున్నారు. మహేష్ బాబు ఒక సినిమాలో మధ్యాన్నం ఎండలో షూటింగ్ చెయ్యను అని చెబితే సదరు దర్శకుడు ఓ సెట్ వేయించి అందులోనే ఏసీ పెట్టించి మరీ గేదెలతో ఆ ఎపిసోడ్ షూట్ ని షూట్ చేసారు. ఇక రీసెంట్ గా త్రివిక్రమ్ తో చేస్తున్న SSMB28 మొదటి షెడ్యూల్ లో ఫైట్ మాస్టర్ కంపోజ్ చేసిన ఫైట్ నచ్చక తనకి అనుకూలమైన యాక్షన్ సీక్వెన్స్ తో మరో షెడ్యూల్ చేయించిన మహేష్ బాబు రాజమౌళి తో సినిమా చెయ్యడం మాటలు కాదు. అలాంటి మహేష్ కి రాజమౌళి ఓ వెసులుబాటు కలిపిస్తున్నారట.

రాజమౌళి తో మహేష్ బాబు చెయ్యబోయే చిత్రమంతా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో ఎక్కువగా జరుగుతుంది. సో మహేష్ బాబు ఎక్కువగా కష్టపడక్కర్లేదు అంటూ సోషల్ మీడియాలో మహేష్ పై నెగిటివిటి చూపిస్తున్నారు యాంటీ ఫాన్స్. అంత సున్నితమైన హీరో రాజమౌళి లాంటి దర్శకుడితో ఎలా పని చేస్తాడో అని మహేష్ అభిమానులే కంగారు పడుతున్నారు.

Negativity on social media against Mahesh:

SSMB29 updates
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs