Advertisement
Google Ads BL

బిచ్చగాడు 3 కూడా..


కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో కమ్ డైరెక్టర్ విజయ అంటోని బిచ్చగాడు సీరీస్ కి శ్రీకారం చుట్టారు. బిచ్చగాడు సినిమాతో తెలుగు, తమిళంలో సూపర్ హిట్ కొట్టిన విజయ్ ఆంటోని.. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యారు. ఆ చిత్రం తమిళనాట కన్నా తెలుగులోనే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దాని తర్వాత ఎన్ని చిత్రాలు చేసినా ఈ ఏడెనిమిదేళ్లలో విజయ్ ఆంటోనికి ఆ స్థాయి హిట్ అయితే దక్కలేదు. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా బిచ్చగాడు కి సీక్వెల్ గా బిచ్చగాడు 2 చేశారు. ఆ చిత్రం రీసెంట్ గా విడుదలైంది. బిచ్చగాడు 2 కి యావరేజ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ పరంగా ఆ చిత్రం అప్పుడే బ్రేక్ ఈవెన్ కి దగ్గరైంది. తెలుగులో బిచ్చగాడు 2 కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. టాక్ తో సంబంధం లేకుండా బిచ్చగాడు 2 కలెక్షన్స్ రాబడుతుంది. బిచ్చగాడు మూవీ మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కి హిట్ అవ్వగా.. బిచ్చగాడు 2 సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కింది. ఈ కాన్సెప్ట్ చాలామందికి కనెక్ట్ కాలేదు. 

అయినప్పటికీ విజయ్ ఆంటోని బిచ్చగాడు 3 ని అనౌన్స్ చేశారు. బిచ్చగాడు సీరీస్ లో భాగంగా బిచ్చగాడు 3 కూడా ఉండబోతుంది అంటూ రీసెంట్ గా ఆయన ప్రకటించాడు. మరి ఈసారి బిచ్చగాడు 3 ఏ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుందో.. అని విజయ్ ఆంటోని ఫాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.

Bichagadu 3 on cards:

Vijay Antony confirms Bichagadu 3
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs