ఎన్టీఆర్-రామ్ చరణ్ కలయికలో రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీలో విలన్ కేరెక్టర్ లో స్కాట్ దోరగా నటించిన స్టీవెన్ సన్ హఠాన్మరణం అందరికి షాకిచ్చింది. ఆర్.ఆర్.ఆర్ తో అత్యంత కౄరుడుగా అందరికి దగ్గరైన స్టీవెన్ మరణించిన విషయాన్ని ఆర్.ఆర్.ఆర్ టీమ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. 58 ఏళ్ళ వయసులో స్టీవెన్ మృతి చెందడానికి కారణం అనారోగ్యమని తెలుస్తుంది.
ఆయన క్యాసినో షూటింగ్ లో ఉండగానే మిస్టరీ ఇలా నెస్ కి గురి కావడంతో క్యాసినో టీమ్ ఆయన్ని వెంటనే దగ్గరలోనే ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో.. ఆరోగ్యం విషమించి ఆయన మృతి చెందినట్లుగా తెలుస్తుంది. స్టీవెన్ హఠాన్మరనికి కారణం అనారోగ్యమే అంటూ ఇటాలియన్ వార్తాపత్రిక రిపబ్లికా వెల్లడించింది.
స్టీవెన్ మృతికి ఆర్.ఆర్.ఆర్ టీమ్ తో పాటుగా రాజమౌళి సంతాపం తెలియజేసారు.