నటుడు శరత్ బాబు కొద్ది సేపటి క్రితం హైదరాబాద్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. కొద్దిరోజుల క్రితం శరత్ బాబు అనారోగ్యం బారిన పడడంతో కుటుంభ సభ్యులు ఆయనని బెంగుళూర్ నుండి హైదరాబాద్‌కు తరలించి, ఏఐజీ హాస్పిటల్స్ లో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు.. పది రోజుల క్రితం ఆయన మరణించినట్లుగా వార్తలు రావడం.. ఆయన ఫ్యామిలీ మెంబెర్స్ శరత్ బాబు ఆరోగ్యంగానే ఉన్నారు.. ఇలాంటి పుకార్లని వ్యాప్తి చెయ్యొద్దు అంటూ వేడుకోవడం జరిగింది.
అప్పటినుండి శరత్ బాబు ఆరోగ్యంపై ఎలాంటి అప్ డేట్ లేదు. ఆయన కోలుకుంటున్నారు అనుకున్నారు. నెలరోజులుగా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ లో ఉన్న ఆయన ఆరోగ్యం విషమించడంతో కొద్దిసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. 71 ఏళ్ల శరత్ బాబు కిడ్నీ, ఊపిరితిత్తులు, కాలేయం మరియు ఇతర అవయవాలు పని చేయకపోవడంతో మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అయితే శరత్ బాబు మరణవార్తని ఆయన కుటుంభ సభ్యులు అధికారికంగా ద్రువీకరించాల్సి ఉంది.
శరత్ బాబు అసలు పేరు సత్యంబాబు దీక్షితులు. శరత్ బాబు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లాలోని, ఆముదాలవలస. అతనికి తొమ్మిది మంది అన్నదమ్ములు. తల్లి ప్రోద్భలంతో ఆయన 1973లో రామరాజ్యం అనే తెలుగు సినిమాతో తన నటనా రంగ ప్రవేశం చేసారు. నాలుగు సంవత్సరాల తర్వాత 1977లో తమిళంలో తన సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన దక్షిణాది అన్ని భాషలలో కలిపి సుమారు 200 లకు పైగా సినిమాలలో హీరోగా నటించారు. రీసెంట్ గా వకీల్ సాబ్ లోను, ఈ వారం విడుదలకాబోతున్న మళ్ళీ పెళ్ళిలో ఆయన నటించారు.
తెలుగు చిత్ర పరిశ్రమ శరత్ బాబు మరణంపై స్పందిస్తూ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.