Advertisement
Google Ads BL

NTR హంగామా ఫినిష్-మహేష్ హంగామా స్టార్ట్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే హడావిడి ముగిసింది. ఎన్టీఆర్ బర్త్ డే సెలెబ్రేషన్స్, అలాగే ఆయన నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల అప్ డేట్స్ తో ఎన్టీఆర్ ఫాన్స్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫాన్స్ సింహాద్రి రీ రిలీజ్ హంగామా, దేవర ఫస్ట్ లుక్ అండ్ టైటిల్, NTR31 అప్ డేట్ ని ట్రెండ్ చేస్తూ రచ్చ రచ్చ చేసారు. గత వారం రోజులుగా ఎన్టీఆర్ ఫాన్స్ చేస్తున్న సందడి చెప్పలేము. ఎన్టీఆర్ హంగామా, హడావిడి ఆల్మోస్ట్ ముగిసింది.

Advertisement
CJ Advs

ఇకపై మహేష్ బాబు హడావిడి మొదలవుతుంది. కృష్ణ గారి పుట్టిన రోజుకి ఆయన కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన మోసగాళ్లకు మోసాగాళ్లు రీ రిలీజ్ చేస్తుంటే.. మహేష్ నటిస్తున్న త్రివిక్రమ్ మూవీ SSMB28 నుండి టైటిల్ అండ్ స్పెషల్ గ్లిమ్ప్స్ వదలబోతున్నారు. మహేష్ ఫాన్స్ ఊరుకుంటారా.. సోషల్ మీడియాలో అప్పుడే హడావిడి మొదలు పెట్టేసారు. రీసెంట్ గానే ఆయన విదేశీ ట్రిప్ నుండి హైదరాబాద్ కి వచ్చేసారు.

జూన్ 7 నుండి SSMB28 కొత్త షెడ్యూల్ మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మే 31 అంటే మరో వారం రోజుల్లో మహేష్ కొత్త సినిమా టైటిల్ అండ్ గ్లిమ్ప్స్ కోసం ఇప్పటినుండే మహేష్ ఫాన్స్ హడావిడి మొదలు పెట్టారు. అలా ఎన్టీఆర్ సందడి ముగిసిందో లేదో.. ఇలా మహేష్ సందడి సోషల్ మీడియాలో మొదలైపోయింది.

NTR hungama finish-Mahesh hungama start:

Mahesh Babu SSMB 28 poster to be out on May 31
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs