Advertisement
Google Ads BL

బిగ్ బాస్ కప్ తో మరోసారి బిందు మాధవి


గత ఏడాది ఇదే సమయానికి బిందు మాధవి ఓటిటి బిగ్ బాస్ విన్నర్ గా అవతరించింది. ఎలాంటి అంచనాలు లేకుండానే బిగ్ బాస్ ఓటిటిలోకి అడుగుపెట్టి నటరాజ్ మాస్టర్, అఖిల్ సార్థక్ లతో గొడవ పెట్టుకుని సివంగి, ఆడపులి అంటూ హైలెట్ అయ్యి చివరికి టైటిల్ పట్టుకుపోయింది. హీరోయిన్ గా తెలుగు, తమిళ, కన్నడ భాషల ఇండస్ట్రీలు లైట్ తీసుకోవడంతో మరోసారి ఫెమస్ అయ్యి మళ్ళీ బిజీ అయ్యేందుకు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన బిందు మాధవి తనదైన ప్రత్యేకతని చూపించకపోయినా.. అఖిల్, నటరాజ్ లే అనుకోకుండా ఆమెని హైలెట్ చేసి వారి చేజేతులా కప్ ని కోల్పోయారు. దానితో బిందు మాధవి బిగ్ బాస్ ఓటిటి టైటిల్ ఎగరేసుకుపోయింది.

Advertisement
CJ Advs

హౌస్ లో యాంకర్ శివ తో క్లోజ్ గా ఫ్రెండ్ షిప్ చేసిన బిందు మాధవి హౌస్ నుండి విన్నర్ అయ్యి బయటికొచ్చాక కూడా శివతో అదే ఫ్రెండ్ షిప్ ని కంటిన్యూ చేసింది. అయితే బిగ్ బాస్ తర్వాత ఆమెకి సినిమా అవకాశాలు రాలేదు కానీ.. డిజిటల్ ఎంట్రీ ఇచ్చి వెబ్ సీరీస్ లతో బిజీ అయ్యింది. బిందు మాధవి నటించిన రెండు వెబ్ సీరీస్ లో బ్యాక్ టు బ్యాక్ విడుదలయ్యాయి. 

మస్తీ, న్యూసెన్స్ వెబ్ సీరీస్ లలో సత్తా చాటింది. అయితే ఈ రెండు వెబ్ సీరీస్ లు బిందు మాధవి కెరీర్ కి అంత ప్లస్ అవ్వలేదనే చెప్పాలి. ఇక బిగ్ బాస్ టైటిల్ తో మరోసారి బిందు మాధవి కనిపించింది. తాను టైటిల్ విన్నర్ అయిన క్షణంలో దిగిన ఫొటోస్ ని షేర్ చేస్తూ Already an year🥰❤️🤗 this will remain a beautiful journey where I steppedout of my comfort zone and was able to flourish….. thanku all for believing me then and now, I was aiming to win the trophy and dnt realise tat I was winning more precious love from u all then, This will remain precious for various reasons… love u❤️ అంటూ మరోసారి తాను సాధించిన టైటిల్ ని గుర్తు చేసుకుంటూ పోస్ట్ పెట్టింది.

Bindu Madhavi once again with Bigg Boss title:

Bindu Madhavi remembered the title of Bigg Boss
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs