టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ పెళ్లి కొడుకు శర్వానంద్ ఎట్టకేలకి పెళ్లి పీటలెక్కబోతున్నాడు. శర్వా ప్రేమించిన రక్షిత రెడ్డి కి పెద్దల అంగీకారంతో మూడు ముళ్లు వేసి ఏడడుగులు నడిచేందుకు రెడీ అయ్యాడు. జూన్ 3న శర్వా-రక్షితల వివాహానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న రక్షిత రెడ్డిని శర్వా ఎప్పటినుండో ప్రేమిస్తున్నాడు. ఇన్నాళ్ళకి పెళ్లి చేసుకోబోతున్న శర్వానంద్ పెళ్లి ఖర్చుపై సోషల్ మీడియాలో ఓ హాట్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది.
రాజస్థాన్ లోని లీలా ప్యాలెస్ లో శర్వానంద్ - రక్షిత రెడ్డిల వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ 2 వ తారీఖున మెహిందీ, సంగీత్ కార్య క్రమాలను ప్లాన్ చేసిన ఫ్యామిలీ మెంబెర్స్ జూన్ 3న అంగరంగ వైభవంగా పెళ్లి చేసేందుకు ప్లాన్ చేసారు. టాలీవుడ్ సినీ, రాజకీయ ప్రముఖులు శర్వానంద్ స్నేహితులు, సన్నిహితులు, కుటుంభ సభ్యుల మధ్యన వీరి పెళ్ళికి గ్రాండ్ గా ఏర్పాట్లు జరుగుతుండగా.. రాజస్థాన్ లోని లీలా ప్యాలెస్ లో వివాహం చేసుకోవాలంటే ఆ ప్యాలెస్ కి అద్దె రోజుకి 4 కోట్లు కట్టాలట.
అంటే అక్కడ పెళ్లి చేసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. హీరోగా, బిజినెస్ మ్యాన్ గా శర్వానంద్ చిన్న చితక వ్యక్తి కాదు. అటు రక్షిత రెడ్డి ఫ్యామిలీ కూడా బాగా పలుకుబడి, ఉన్నత కుటుంబానికి చెందిన అమ్మాయి కావడంతోనే.. శర్వానంద్ ఇలా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నాడని, ఖర్చు విషయంలోనూ వెనుకాడకుండా లీలా ప్యాలెస్ కి ఆరు నుండి ఎనిమిది కోట్ల అద్దె కూడా కడుతున్నాడని.. పెళ్లి ఖర్చులు ఇంకా చాలా ఉంటాయని వినికిడి.