Advertisement
Google Ads BL

ప్లాప్ హీరోకి ఆ మాత్రం ఉండాలి


రవితేజ కొద్దిరోజులుగా సక్సెస్ లేక సతమతమవుతున్నాడు. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ డిజాస్టర్స్ తర్వాత ధమాకాతో హిట్ కొట్టినా.. ఆ సక్సెస్ శ్రీలీల ఖాతాలోకి వెళ్ళిపోయింది. శ్రీలీల వలనే ధమాకాకి 100 కోట్లు వచ్చాయనేది అంగీకరించాల్సిన వాస్తవం. ఇక తర్వాత వెంటనే మెగాస్టార్ తో కలిసి వాల్తేర్ వీరయ్య హిట్ అందుకున్నాడు. అది కూడా మెగాస్టార్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. 

Advertisement
CJ Advs

తర్వాత ఎన్నో అంచనాల మధ్యన విడుదలైన రావణాసుర అట్టర్ ప్లాప్ అయ్యింది. రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచింది. ఇలా ప్లాప్ లతో సతమతమవుతున్న రవితేజ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అంచనాలు క్రియేట్ చెయ్యాలంటే ఎంతోకొంత హడావిడైతే ఖచ్చితంగా ఉండాల్సిందే. అందుకే రవితేజ నుండి వస్తున్న ప్యాన్ ఇండియా ఫిలిం టైగర్ నాగేశ్వరరావుపై అంచనాలు క్రియేట్ చేసేందుకు ఫస్ట్ లుక్ లాంచ్ తోనే భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఏపీలోని రాజమహేంద్రవరంలో టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ కోసం భారీ ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ నెల 24న రవితేజ టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ వదిలేందుకు పలు భాషల హీరోలు రెడీ అయ్యారు. తెలుగులో విక్టరీ వెంకటేష్, తమిళంలో కార్తీ, కన్నడలో శివరాజ్ కుమార్, మలయాళంలో దుల్కర్, హిందీలో జాన్ అబ్రహమ్ లు రవితేజ టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ వదిలేందుకు గెస్ట్ లుగా సెలక్ట్ అయ్యారు.

వరస ప్లాప్ లు ఉన్నప్పుడు ప్యాన్ ఇండియా ఫిలిం పై భారీ క్రేజ్, హైప్ క్రియేట్ చెయ్యాలంటే ఆ మాత్రం హడావిడి అవసరమే అంటున్నారు నెటిజెన్స్. ఇలాంటి సందడి చేస్తేనే సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తి మొదలయ్యేది.. ఏదైనా టైగర్ నాగేశ్వరరావు మేకర్స్ తెలివైనోళ్లే.

A flop hero should have that:

5 SUPERSTARS will introduce Tiger Nageswara Rao in 5 LANGUAGES
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs