Advertisement
Google Ads BL

మహేష్ ఫాన్స్ ఒప్పేసుకున్నారట


సీనియర్ నరేష్ కృష్ణగారి ఫ్యామిలీకి కావాల్సిన వాడు. అయితే విజయ నిర్మల, కృష్ణగారు పోయాక ఘట్టమనేని ఫ్యామిలీతో ఎప్పుడూ కనిపించని నరేష్.. ఇప్పుడు పవిత్ర లోకేష్ తో నాలుగో పెళ్లి కోసం తహతహలాడుతున్నాడు. ప్రస్తుతం నరేష్-పవిత్ర లోకేష్ కలిసి కృష్ణగారు-విజయనిర్మల మళ్ళీ పెళ్లి చిత్రాన్ని చేసారు. ఆ సినిమా ప్రమోషన్స్ లో యంగ్ అండ్ ఎనర్జిటిక్ కపుల్ లా రెచ్చిపోయి రొమాన్స్ చేస్తున్నారు. అసలు యంగ్ ఏజ్ లో ఉన్న లవ్ బర్డ్స్ కి అయినా ఇది సాధ్యమేనా అన్నట్టుగా పవిత్ర-నరేష్ లు కనిపిస్తున్నారు. 

Advertisement
CJ Advs

అయితే తమ బంధాన్ని, తనని మహేష్ అభిమానులు హార్ట్ ఫుల్ గా అంగీకరించారంటూ వారికి థాంక్స్ చెబుతుంది పవిత్ర. నిన్న సాయంత్రం జరిగిన మళ్ళీ పెళ్లి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవిత్ర లోకేష్ ఈ వివిధమైన వ్యాఖ్యలు చెయ్యగా.. నరేష్ మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాల తరువాత ఇంకో అమ్మ దొరకడం నా అదృష్టం. కృష్ణ గారి ఫ్యాన్స్ కు గానీ మహేష్ బాబు ఫ్యాన్స్ కు గానీ ధన్యవాదాలు అంటూ పవిత్ర లోకేష్ ని అమ్మతో పోలుస్తున్నాడు.

త్వరలోనే నరేష్ కి మూడో భార్య రమ్య నుండి విడాకులు రాగానే.. నరేష్-పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉండడమే కాదు.. ఆయన పలు ఇంటర్వ్యూల్లో తనకి 1000 కోట్లు పైనే ఉండచ్చేమో అంటూ మాట్లాడుతుండడం చూసిన చాలామంది పవిత్ర లోకేష్ అతన్ని డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటుంది.. ఇద్దరి పిల్లలని వదిలేసి నరేష్ తో సహజీవనం చేస్తుంది అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.

Mahesh fans have agreed: Pavitra:

Mahesh & Entire Family Accepted Our RelationshiP: Naresh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs