Advertisement
Google Ads BL

జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు ఎమోషనల్ పోస్ట్


కన్నడ యాక్ట్రెస్ సౌమ్య రావు సీరియల్స్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి దగ్గరై ఇప్పుడు జబర్దస్త్ స్టేజ్ పై యాంకర్ గా అందాలు ఆరబోస్తూ వచ్చిరాని తెలుగుతో బుల్లితెర ప్రేక్షకులకి, కామెడీ ప్రియులకి బాగా చేరువైంది.. అనసూయ ప్లేస్ ని జబర్దస్త్ స్టేజ్ పై రీప్లేస్ చేసింది. ప్రస్తుతం యాంకర్ గా ఫిక్స్ అయిన సౌమ్య రావు తన తల్లి క్యాన్సర్ తో బాధపడుతూ చివరి రోజుల్లో ఎంతగా నరకాన్ని అనుభవించిందో ఓ వీడియో ద్వారా ఎమోషనల్ అవుతూ అందరితో పంచుకుంది.

Advertisement
CJ Advs

ఆసుపత్రి బెడ్ పై సౌమ్య తల్లి ఉండగా.. సౌమ్య ఆమెని చూసుకుంటూ నవ్వించడానికి ట్రై చేస్తున్న వీడియో అది. అంబులెన్స్, హాస్పిటల్, డాక్టర్స్, ట్రీట్మెంట్, మెడిసిన్ ఇలా నువ్వు చాలా బాధపడ్డావు. నీ కోసం నేను దేవుడిని ప్రార్థిస్తూ పూజలు చేస్తూ, ఉపవాసాలు చేశాను, అయినా ఆ దేవుడు కరుణించలేదు. ఆ దేవుడు నాకెందుకిలా చేసాడో అర్ధం కావడం లేదు.. అందరూ అమ్మ ఫోటో షేర్ చేసి మథర్స్ డే కి విషెస్ చెప్పారు.

కానీ నాకు మాత్రం నువ్వు చివరి రోజుల్లో అనుభవించిన బాధే గుర్తొస్తుంది. నేను అస్సలు మరిచిపోలేకపోతున్నాను, రేయి పగలు నీకు సేవ చేశాను, భగవంతుణ్ణి ప్రార్ధించాను.. అయినా దేవుడు కరుణించలేదు, చేసినవన్నీ వృధా అయ్యాయి. నువ్వు నా నుంచి దూరమయ్యావు. నువ్వు లేకుండా నేనుండలేను, ప్రతి క్షణం నిన్ను మిస్ అవుతున్నాను, నువ్వు మళ్ళీ పుడతావని ఆశిస్తున్నాను, దేవుడా నా తల్లితండ్రుల్ని తిరిగి నాకివ్వు ప్లీజ్.. ఐ లవ్ యు సో మచ్ అంటూ కన్నడలో సౌమ్య రావు రాసిన ఎమోషనల్ నోట్.. ఆమె షేర్ చేసిన వీడియో వైరల్ గా మారాయి.

Jabardasth anchor Sowmya Rao emotional post:

Jabardasth Anchor Sowmya Rao gets emotional after mother death
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs