Advertisement
Google Ads BL

అక్కినేని-నందమూరి గొడవా.. ఇది చుడండి


అక్కినేని నాగార్జునకి నందనమూరి బాలకృష్ణకి పడదు. అందుకే అక్కినేని చనిపోయినప్పుడు కూడా బాలయ్య వెళ్ళలేదు, ఎందుకో నాగ్ కి బాలయ్యకి మధ్యలో ఈగో ఫీలింగ్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరూ ఒకే స్టేజ్ పై కూడా ఎప్పుడూ కనిపించరు. ఎన్టీఆర్-ANR లు ఎంతో ఆత్మీయంగా ఉండేవారు. కానీ రెండో తరం వారసులకు పడడం లేదు.. ఇది సోషల్ మీడియాలో తరుచు కనిపించే న్యూస్. మొన్నీమధ్యన బాలకృష్ణ అక్కినేని నాగేశ్వర రావు ని అక్కినేని తొక్కినేని అంటూ అవమానించారంటూ అక్కినేని అభిమానులు నానా గోల చేసారు. అఖిల్, చైతూలు సోషల్ మీడియాలో అక్కినేనిపై గౌరవం అంటూ లెటర్స్ కూడా పోస్ట్ చేసారు.

Advertisement
CJ Advs

కానీ ఇప్పుడు అక్కినేని-నందమూరి ఫ్యామిలీల మధ్యన ఎలాంటి ఈగోలు లేవంటూ నాగ చైతన్య నిరూపించాడు. నందమూరి తారకరరావు గారి శతజయంతి ఉత్సవాలకు అక్కినేని ఫ్యామిలీ కూడా పిలుపు వెళ్ళింది. నాగార్జున ఎన్టీఆర్ సెంచరీ సెలబ్రేషన్స్ కి వెళ్లకపోయినా నాగ చైతన్య, సుమంత్ ఎన్టీఆర్ సెంచరీ సెలెబ్రేషన్స్ కి హాజరయ్యారు. బాలయ్య కి హాగ్ కూడా ఇచ్చాడు చైతు. ఈ రోజు స్టేజి మీద నాకు మాట్లాడే అవకాశం  కల్పించిన నందమూరి బాలకృష్ణ గారికి నా ధన్యవాదాలు అంటూ చైతూ ఆ ఈవెంట్ లో మాట్లాడాడు.

అది చూసిన అందరూ నాగ చైతన్య సూపర్. అక్కినేని ఫ్యామిలీ తరపున ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నాడు అని అక్కినేని ఫాన్స్ అంటుంటే.. బాలయ్య గొప్పతనం, కల్మషం లేని వ్యక్తి 👏చైతూని ఆత్మీయంగా హాగ్ చేసుకున్నారు అంటూ నందమూరి అభిమానులు సంతోషపడిపోతున్నారు.

Naga Chaitanya attended NTR centenary Celebrations:

Naga Chaitanya and Sumanth attended NTR centenary Celebrations
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs