Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ రాలేకపోయాడు.. చరణ్ వచ్చాడు


యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాతగారు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు రాలేకపోతున్నందుకు చింతిస్తున్నట్టుగా తన పర్సనల్ పీఆర్వో ద్వారా మెసేజ్ ఇప్పించాడు. అయితే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ఇలా కుర్ర హీరోలు, ఫ్యాన్ ఇండియా స్టార్స్ హాజరవుతారంటూ గత రెండు రోజులుగా వాళ్ళ ఫొటోస్ వేసి ప్రచారం చేసారు. కానీ చరణ్, అల్లు అర్జున్ లు హాజరవడం లేదంటూ మరో రూమర్ సోషల్ మీడియాలో వినిపించింది.

Advertisement
CJ Advs

అయితే ఈరోజు రామ్ చరణ్ నందమూరి తారకరామారావు గారి సెంచరీ సెలెబ్రేషన్స్ లో ప్రత్యేకంగా కనిపించాడు. రామ్ చరణ్ చంద్రబాబు నాయుడు పక్కనే ఆశీనులైన పిక్ ని వీడియో నుండి కట్ చేసి మరీ సోషల్ మీడియాలో చరణ్ ఫాన్స్ వైరల్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎన్టీఆర్ మిస్ అయినా ఆర్.ఆర్.ఆర్ మరో చరణ్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు హాజరవడం మెగా ఫాన్స్ కి ఆనందాన్నిచ్చింది. అలాగే అక్కినేని హీరోలైన నాగ చైతన్య, సుమంత్ స్పెషల్ గా కనిపించారు.

బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు, శివ రాజ్ కుమార్ ఇంకా సీనియర్ ఎన్టీఆర్ తో నటించిన హీరోయిన్స్ జయప్రద, రోజారమణి, అలాగే రాజకీయ నాయకులు హాజరైన ఈ ఈవెంట్ హైదరాబాద్ లోని KPHP కైత్లాపూర్ మైదానంలో గ్రౌండ్ లో ప్రస్తుతం అంగరంగ వైభవంగా జరుగుతుంది.

NTR missed.. Charan attended:

Ram Charan attends NTR Centenary celebrations
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs