Advertisement
Google Ads BL

NTR 30 : పవర్ ఫుల్ లుక్ తో టైటిల్ రివీల్డ్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సంబరాలు మొదలైపోయాయి. నిన్నటి నుండే ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ నుండి ఫస్ట్ లుక్ పై మేకర్స్ ఆసక్తిని, అంచనాలు క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫాన్స్ ని అడుగడుగునా సర్ ప్రైజ్ చేస్తున్నారు. రేపు మే 20 న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కొరటాల శివ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీగా చేస్తున్న NTR30 టైటిల్ ని దేవరగా ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ తో వదిలారు. గత కొద్దిరోజులుగా NTR30 టైటిల్ దేవర అంటూ ప్రచారం జరిగినట్టుగానే ఎన్టీఆర్ దేవరగా పవర్ ఫుల్ లుక్ లో కనిపించాడు.

Advertisement
CJ Advs

రగడ్ లుక్ లో స్ట్రాంగ్ ఇంప్రెషన్ పడేలా కర్లీ హెయిర్ తో మైటీ అండ్ మాస్కలిన్ లుక్ లో రఫ్ఫాడించాడు ఎన్టీఆర్. సముద్రంలో చేపలని పట్టే యువకుడు అనేకన్నా సముద్రంలో శత్రువులను వేటాడే సింహం మాదిరి పవర్ ఫుల్ లుక్ లో ఎన్టీఆర్ కనిపించాడు. ఆ లుక్ చూస్తే సముద్రంలో ఓ భీకర పోరాటం జరగగా అందులో ఎన్టీఆర్ వేటగాడిగా అందరిని నరుక్కుంటూపోయే సన్నివేశపు లుక్ అది. సముద్రం ప్రశాంతంగా కనిపించినా.. ఒకేసారి అలజడితో ఎగసిపడినట్లుగా, ఎన్టీఆర్ దేవర కేరెక్టర్ కూడా అదే మాదిరి కూల్ గా కనిపించినా.. అవసరమొచ్చినప్పుడు అతనిలోని ఉగ్రరూపం బయటికొస్తుంది.. అనిపించేలా అతని లుక్ డిజైన్ చేసారు.

దేవరగా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ని మాస్ అండ్ రగడ్ లుక్ లో ప్రెజెంట్ చెయ్యడం, ఎన్టీఆర్ చేతిలో మారణాయుధం, దానికి అంటిన రక్తం చూస్తే దేవర చిత్రం పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ అనిపిస్తుంది. ఎన్టీఆర్ పుట్టిన రోజున ఇది బెస్ట్ ట్రీట్ అంటూ దేవర టైటిల్ అండ్ లుక్ తో ఎన్టీఆర్ ఫాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. 

NTR 30: Title Revealed With Powerful Look:

Devara has been finalised as the title for NTR30
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs