Advertisement
Google Ads BL

సైలెంట్ గా పని కానిచ్చేస్తున్న రాజమౌళి


ఆస్కార్ తర్వాత రాజమౌళి చాలా సైలెంట్ గా కనిపిస్తున్నారు. రామ్ చరణ్ బర్త్ డే పార్టీ, ఎన్టీఆర్ మూవీ ఓపెనింగ్, కీరవాణి, చంద్రబోస్ ల సత్కారానికి హాజరైన రాజమౌళి ప్రస్తుతం సైలెంట్ గా తన తదుపరి మూవీ కథ, స్క్రిప్ట్ పై పని చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మహేష్ బాబు తో రాజమౌళి చెయ్యబోయే చిత్రం గ్లోబల్ వైడ్ ఉండేలా ప్లాన్ చేసుకుని దానికి అనుగుణంగా రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టినట్లుగా తెలుస్తుంది. ఈ ఏడాది చివరి వరకు అంటే డిసెంబర్ వరకు ప్రీ ప్రొడక్షన్ కే సమయం కేటాయించి ఆ తర్వాత సినిమా సెట్స్ లోకి వెళ్లేలా రాజమౌళి ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది.

Advertisement
CJ Advs

మహేష్ బాబు కూడా త్రివిక్రమ్ తో చేస్తున్న SSMB28 షూటింగ్ ని డిసెంబర్ మొదటి వారానికల్లా ఫినిష్ చేసేసి రాజమౌళి మూవీ సెట్స్ లోకి వెళతారని తెలుస్తుంది. రాజమౌళి-మహేష్ మూవీ డిసెంబర్ నుండి స్టార్ట్ అవ్వొచ్చని ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక డిసెంబర్ లో కుదరదు అనుకుంటే.. జనవరిలో మహేష్ SSMB28 రిలీజ్ అయ్యాకే రాజమౌళి-మహేష్ SSMB29 అఫీషియల్ గా మొదలవుతుంది అని తెలుస్తుంది.

ఈ చిత్రంలో మహేష్ తో రొమాన్స్ చెయ్యబోయే హీరోయిన్ బాలీవుడ్ నుండి లేదా హాలీవుడ్ నుండి అయినా తీసుకురావాలని రాజమౌళి అండ్ కో భావిస్తోందట. ఈ చిత్రానికి కూడా కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తారు.

Rajamouli Wants To Keep Silent From Now?:

Rajamouli is working silently for SSMB29 pre production work
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs